నికరాగ్వాలో జర్నలిస్టులపై దాడులు

attacks on journalists
attacks on journalists

322 మంది పౌరుల మృతి,500 మందికిపైగా జైళ్లపాలు
మనాగ్వా: పత్రికాస్వేఛ్ఛపై నికరాగ్వాప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పాత్రికేయులపైనా విచ్చలవిడిగాపోలీసులు దాడులుచేసి తీవ్రంగా కొట్టడం, వేధించడం హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకూ కనీసం 322 మంది ప్రజలు చనిపోయారని, మరో 500 మందికిపైగా జైళ్లపాలయ్యారని నికరాగ్వాలోని మానవహక్కుల కేంద్రంప్రకటించింది. ప్రభుత్వం ఈ సంస్థను ఇప్పటికే బ్లాక్‌లిస్ట్‌లోపెట్టింది. ముందురోజే నికరాగ్వాపోలీసులు కనీసం ఏడుగురు పాత్రికేయులను చితకబాదారని,వారిలో దేశంలోనే అత్యుత్తమ సంపాదకులు కూడా ఉన్నారని, స్వతంత్ర మీడియాపై ఉక్కుపాదంమోపేందుకు ఈచర్యలు చేపట్టిందని హక్కుల సంస్థలు ధ్వజమెత్తాయి. దేశ అధ్యఓఉడు డేనియల్‌ ఆర్టెగాకు వ్యతిరేకంగా ఎగిసిన నిరసనలను అణగదొక్కేనెపంతో ముందు పాత్రికేయులపై ఉక్కుపాదం మోపింది. అంతకుముందు ఈ వారంలోనే పోలీసులు కార్లోస్‌ ఫెర్నాండో ఛామర్రో కార్యాలయాన్ని స్వాధీనంచేసుకున్నారు. అలాగే అనేక పౌరహక్కుల సంస్థల కార్యాలయాలను కూడా స్వాధీనంచేసుకుని వీటినినిషేధించారు. పోలీస్‌ కేంద్ర కార్యాలయాల ఎదుట గుమికూడిన జర్నలిస్టులను మనాగ్వాలో దాడిచేసి చెదరగొట్టారు. సంపాదకులు చామర్రో అధికారులను తన కార్యాలయాలపై దాడులు అక్రమమని, యంత్రసామగ్రి, కార్యాలయాలను జప్తుచేయడం అన్యాయమని వాదించారు. వెనువెంటనే పోలీసులు లాఠీలు చేతబట్టివచ్చి చామరో ఇతర సన్నిహితులను విలేకరులను దాడిచేసి ఈ సంఘటనను కవర్‌చేయకుండా హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. జాతీయ అంతర్జాతీయ మీడియాకు చెందిన ఏడుగురు జర్నలిస్టులు తీవ్రంగా గాయపడ్డారని, వారిలో సంపాదకులు చామరో కూడా ఒకరని, పోలీసులు వీరందరిని గెంటివేసి తీవ్రంగా కొట్టారని మీడియా సంస్థలు వెల్లడించాయి. అంతేకాకుండా జర్నలిస్టులను వెంటాడి మరీ కొట్టారని, జర్నలిస్టులను తిరుగుబాటు కుట్రదారులుగా అరుస్తై అందరి సెల్‌ఫోన్లు, యంత్రాలను స్వాధీనంచేసుకుంటామని హెచ్చరించారు. ముగ్గురు అధికారులు తనను కొట్టారని ఒకజర్నలిస్టు నస్టార్‌ ఏర్స్‌ వెల్లడించారు. తనను బూటుకాలితో కాలిపై తన్నారని, కిందపడేసారని అన్నారు. గడచిన ఏప్రిల్‌నుంచి నికరాగ్వాలో హింసాత్మక చర్యలు పెరుగుతున్నాయి. 1980నాటి పౌరుద్ధం తర్వాత నిరసనలు నెలలపాటుప్రభుత్వంపై వెల్లువెత్తాయి. ప్రభుత్వం వీటిని అణిచివేసేందుకు పోలీస్‌ చర్యలు పెంచింది. సుమారు 322 మందివరకూ చనిపోయారని, 500మందికిపైగా జైళ్లలో నిర్బంధించిందని పౌరహక్లుకసంస్థ వెల్లడించింది. స్వఛ్చంద సంస్థలు, స్వతంత్ర మీడియా వ్యవస్థలు, పాత్రికేయులపై అణిచివేత జరుగుతున్నదని అంతర్జాతీయ సంస్థలు ఆరోపించాయి. ఆర్టెగా ప్రభుత్వం ఈ సంఘటనపై ఎలాంటి ప్రకటనచేయలేదు. నిరసనకారులు ప్రభుత్వాన్ని కూలదోసేందుకు తిరుగుబాటుకు యత్నించారని ఆర్టెగా వెల్లడించారు.