టెహ్రాన్ లో కూలిన కార్గో విమానం

plane crash in tehran
plane crash in tehran

టెహ్రాన్ః  ఇరాన్‌ రాజధాని తెహ్రాన్‌లో సైన్యానికి చెందిన ఓ కార్గో విమానం కుప్పకూలింది. ఆ దేశ మీడియా సమాచారం ప్రకారం విమానంలో ఉన్న 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. విమానం ల్యాండ్‌ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇరాన్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధి రీజా జాఫర్జాదేహ్‌ అక్కడి మీడియాకు వెల్లడించారు. మాంసం సరఫరా చేసేందుకు కిర్గిస్థాన్‌ రాజధాని బిషెక్‌ నుంచి ఈ కార్గో విమానం బయల్దేరింది. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పైలెట్‌ విమానం వేరే రన్‌వేపై దించేందుకు ప్రయత్నిస్తుండగా పక్కనే ఉన్న భవనాన్ని ఢీకొట్టి కుప్పకూలిపోయింది.