కూలిన భవనం..14 మంది మృతి

పాకిస్థాన్‌లోని గుల్‌బహార్ ప్రాంతంలో ఘటన

building collapses in Karachi
building collapses in Karachi

కరాచీ: పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలోని గుల్‌బహార్ ప్రాంతంలో ఐదు అంతస్తుల రెసిడెన్షియల్ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 14 మంది మరణించారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కరాచీ నగరంలోని అబ్బాసీ షహీద్ ఆసుపత్రికి తరలించారు. భవనం శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం అబ్బాసీ షహీద్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. భవనం కూలిన ఘటనలో సహాయ పునరావాస పనులు చేపట్టాలని సింధ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మురాద్ అలీ షా కరాచీ కమిషనర్ ను ఆదేశించారు. భవనం కూలిన ఘటనపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని సింధ్ సీఎం మురాద్ అలీ ఆదేశించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/