కుప్ప‌కూలిన మిలిట‌రీ విమానం

MILITRY AEROPLANE
MILITRY AEROPLANE

సియోల్ః సౌత్ కొరియన్ మిలటరీ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. ఎఫ్-15 స్లామ్ ఈగల్ విమానం ఉత్తరజియాంగ్‌సాంగ్ ప్రావిన్స్ లోని చిల్గోక్ ప్రాంతం నుంచి డాగ్యూ ఎయిర్‌బేస్‌కు తిరిగొస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దర పైలట్ల మృతదేహాలను గుర్తించామని, పైలట్ల పూర్తి వివరాలను తెలుసుకుంటున్నామని ఎయిర్‌ఫోర్స్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. గత ఏడాది ఇదే ప్రాంతంలో ఎఫ్-16 డీ విమానం కుప్పకూలిపోగా..ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.