కుంభకోణం నిందితులను భారత్‌కు రప్పిస్తాం: నిర్మల

Nirmala Sitharaman
Nirmala Sitharaman

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం కేసులో నిందితులు ప్రముఖ వ్యాపారవేత్తలు నీరవ్‌ మోది,మహల్‌ చోక్సీలను వదిలిపెట్టమని నిర్మలా సీతారామన్‌ అన్నారు. నీరవ్‌, చోక్సీలిద్దరూ ఆర్ధిక నేరానికి పాల్పడ్డారని అవినీతిపరులను వదిలిపెట్టమని ఆమె అన్నారు. అవినీతి రహిత పాలన అందించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా బిజెపి ప్రభుత్వం పనితీరు అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ప్రభుత్వ పథకాలతో మెరుగైన సంస్కరణలకు పెద్దపీట వేస్తుందని చెప్పారు.