కాబూల్ మిలిట‌రీ అకాడ‌మీపై ముష్క‌రుల దాడి

attack on kabul military academy
attack on kabul military academy

కాబూల్ః అఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబుల్‌లోని మిలిటరీ అకాడమీపై ముష్కరులు దాడి చేశారు. మార్షల్‌ ఫాహిమ్‌ మిలిటరీ అకాడమీపై దాడికి పాల్పడ్డ వారిలో కొందరిని హతమార్చినట్లు భద్రతా అధికారులు తెలిపారు. దుండగులు మిలటరీ అకాడమీకిలోకి ప్రవేశించడంలో విఫలమయ్యారని వెల్లడించారు. అకాడమీపై రాకెట్‌ దాడి జరగడంతో పాటు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారని కాబుల్‌ పోలీసు విభాగం అధికార ప్రతినిధి వెల్లడించారు. భద్రతా సిబ్బంది దాడిని ఎదుర్కొని పరిస్థితిని చక్కబెట్టినట్లు తెలిపారు. తెల్లవారుజామున అకాడమీ వద్ద పేలుడు శబ్దాలు, కాల్పుల చప్పుడు వినిపించిందని కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు అక్కడి మీడియా పేర్కొంది.