కత్తుల దాడిలో ముగ్గురు యువకుల మృతి

ఒకే వర్గానికి చెందిన రెండు గ్రూపుల మధ్య గొడవ

murdere
murdere

లండన్‌: లండన్‌లో ముగ్గురు సిక్కులు హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకే వర్గానికి చెందిన రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ గొడవలు మరింత ఉద్రిక్తంగా మారడంతో ఓ వర్గం వ్యక్తులు మరో వర్గంపై కత్తులతో దాడికి దిగారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ముగ్గురు సిక్కులు ప్రాణాలు కోల్పోయారు. వారి వయసు 20-30 ఏళ్ల మధ్య ఉంటుందని చెప్పిన పోలీసులు ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/