ఓటమికి గల కారణాలను ‘వ్యాట్‌ హ్యాపెన్డ్‌’ లో తెలిపిన హిల్లరి

trump and hillory
trump and hillory

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్ధి ట్రంప్‌పై ఓడిపోవడానికి గల కారణాలను వివరిస్తూ హిల్లరి  క్లింటన్‌ ‘వాట్‌ హ్యాపెన్డ్‌’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. దీనికి స్పందిస్తూ హిల్లరిపై ట్రంప్‌ ట్విట్టర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. హిల్లరి క్లింటన్‌కు తన తప్పులు ఒప్పుకోకుండా ఇతరులపై నిందలు వేయడం మాత్రమే తెలుసునని అన్నారు. ఎంత డబ్బు ఖర్చు చేసినా ఆట గెలవలేకపోయిందని ట్వీట్‌లో పేర్కొన్నారు. పుస్తకావిష్కరణ సమయంలో హిల్లరి మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడిపోయినా అమెరికన్ల తరఫున మాట్లాడుతూనే ఉంటానని, తాను మాట్లాడే ప్రతి విషయాన్ని మీడియా సీరియస్‌గా తీసుకోవాలని తెలిపారు.