ఐరాస ఏకపక్షంగా వ్యవహరిస్తోంది: భారత్‌

UNO
UNO

జెనీవా: నేడు ఐక్యరాజ్యసమితిలో అసెంబ్లీలో జర్నలిస్ట్‌ షుజాత్‌ భుకారీ, జవాన్‌ ఔరంగజేబ్‌ల హత్యలను భారత్‌ లెవనెత్తింది. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్‌లో మానవహక్కుల హననం గురించి ఐక్యరాజ్యసమితి నివేదికను ఎండగట్టింది. పొరుగు దేశం నుంచి వస్తున్న తీవ్రవాదులు జమ్మూకశ్మీర్‌లో నెత్తుటి ఏర్లుపారేలా చేస్తున్నారని ధ్వజమెత్తింది. పవిత్రమైన రంజాన్‌ సమయంలోనే వీరిద్దరికి దారుణంఆ హత్య చేశారని తెలిపింది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కౌన్సిల్‌లో భారత శాశ్వత ప్రతినిధి రాజీవ్‌ చందర్‌ మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితి నివేదిక ఎవరి ప్రోద్బలంతోనే తయారిచేసింది అని ఆరోపించారు. జరుగుతున్న దారుణాలను పరిగణనలోకి తీసుకోకుండానే నివేదికను ఏకపక్షంగా రూపొందించారని విమర్శించంది. తీవ్రవాదానికి చట్టబద్దత కల్పించేలా ఐ.రా.స కౌన్సిల్‌ వ్యవహరిస్తోందని భారత్‌ మండిపడింది. ఇలాంటి చర్యల వల్ల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుందని తెలిపింది. కశ్మీర్‌లో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఉందని, రాజ్యాంగాన్ని ఆ ప్రభుత్వాన్ని కాపాడుతుందని చెప్పింది.