ఉల్లి కోసం ఆసియా దేశాల కటకట!

ONIONSSS
ONIONSSS

ఉల్లి కోసం ఆసియా దేశాల కటకట!

ముంబై, డిసెంబరు 3: ఉల్లి కటకట కేవలం భారత్‌కే పరిమితం కాలేదు. మిగిలి న ఆసియా దేశాలనూ తాకింది. ఉల్లి సరఫరా తక్కువగా ఉండటంతో భారత్‌ ఇప్పటికే ఎగుమతులపై పరిమితులు విధించడం, ప్రపంచ మార్కెట్‌లో ఉల్లి అందుబాటులో లేని కారణంగా మిలిగిన ఆసియా దేశాలైన బంగ్లాదేశ్‌, మలేసి యా, ఉల్లికోసం కటకటలాడుతున్నాయి. రాబోయే రెండు నెలల్లో ఉల్లిపై భార త్‌ పరిమితులు ఎత్తివేస్తుందని, తద్వారా అటు ధరతోపాటు, కొరత తగ్గు ముఖం పట్టొచ్చని అక్కడి వ్యాపారులు అభిప్రాయపడు తున్నారు. ఉల్లికి భారత్‌తో పాటు ఇతర ఆసియా దేశాల్లో విపరీతమైన గిరాకీ ఉంది.

ముఖ్యంగా పాకిస్థాన్‌, మలేసి యా, బంగ్లాదేశ్‌లో వీటి వినియోగం ఎక్కువ. గతేడాది విపరీతంగా ఉల్లిని పండించి నష్టపోయిన భారత్‌, పాక్‌ రైతులు ఈ సారి సాగు విస్తీర్ణం తగ్గించారు. ఫలితంగా ఉల్లి కొరత ఏర్పడింది. దీంతో భారత్‌ ఎగుమతులపై పరిమితి విధించింది

. ఈ ఏడాది చివరి వరకు టన్ను ఉల్లిధరను 850డాలర్లుగా నిర్ణయించింది. దీంతో కొద్దిమంది మాత్రమే ఆ ధరను చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారని, చాలా వరకు ఎగుమతులు తగ్గుముఖం పట్టాయని ముంబైకి చెందిన ఎగుమ తుల వ్యాపారి ఒకరు తెలిపారు. గతంతో పోలిస్తే ఈ ధర 7రెట్లు అధికం. భారత్‌ నుంచి ముఖ్యంగా బంగ్లాదేశ్‌, మలేసియా, యూఏఈకి ఉల్లి ఎగుమతి అవుతుంటాయి. భారత్‌ సహా పాకిస్థాన్‌, చైనా, ఈజిప్ట్‌ ఉల్లిని ఎగుమతి చేస్తుంటాయి.

భారత్‌లో ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో ఆసియా దేశాల్లో ధరలు ఆకాశాన్ని తాకాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్‌లో ఇటీవల కేజీ ఉల్లి100టాకాలకు చేరింది. ఒకసారి భారత్‌లో పంట చేతికొచ్చాక ధర తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఢాకాకు చెందిన ఓ వ్యాపారి ఆశాభావం వ్యక్తంచేశారు. మరోవైపు మలేసియా, బంగ్లాదేశ్‌, శ్రీలంక, యూఏఈ, ఇండోనేషియా, నేపాల్‌ వంటి దేశాలు చైనా, ఈజిప్టు వైపు చేస్తున్నాయి. అయి తే, ఆయా దేశాలు ఆశించిన మేర ఎగుమతి చేయలేవని మలేసియాకు చెందిన వ్యాపారి ఒకరు తెలిపారు.

ఇంకోవైపు పాక్‌లో ఇప్పటికే ఎగుమతులపై అనధికారిక నిషేధం అమలవు తోంది. రుచి, రవాణాపరంగా ఆసియా దేశాలు భారత్‌ నుంచి ఉల్లిని దిగుమతి చేసేందుకు మొగ్గు చూపుతుంటాయి. దేశంలో ముఖ్యంగా మూడు సీజన్లలో ఉల్లిని సాగు చేస్తుంటారు.

వేసవి చివర్లోసాగుచేసే ఉల్లిడిసెంబరులో మార్కె ట్‌లోకి వచ్చే అవకాశం ఉందని, అప్పుడు ధరలు దిగొస్తాయని భారత్‌కు చెందిన జాతీయ హార్టీకల్చర్‌ రీసెర్చ్‌, డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ పీకే గుప్తా తెలిపారు. అయితే, పంట మార్కెట్‌లోకి వచ్చినా మిగులు కొంత మాత్రమే ఉండే అవకాశం ఉందని, తొలుత దేశంలో ఉల్లిధరలు తగ్గుముఖం పట్టిన తర్వాతే ఎగుమతులు గురించి ఆలోచించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.