ఉగ్రనిర్మూలన కోరితే పాక్‌కు సాయం

rajnath singh
rajnath singh

కేంద్రహోంమంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌
జైపూర్‌: పాకిస్తాన్‌ఉగ్రవాదాన్ని కట్టడిచేయడంలో విఫలం అయితే భారత్‌ అవసరమైతే అందుకు సహకరిస్తుందని, ఒంటరిగా పోరాడలేమని భావిస్తే తాము సాయం అందిస్తామని హోంమంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ పేర్కొన్నారు. జమ్ముకాశ్మీర్‌వల్ల సమస్య లేదని, భారత్‌లో అంతర్భాగమేనని ఆయన అన్నారు. పాకిస్తాన్‌ ఉగ్రవాదంను ఎదుర్కొనడంలో కోరితే భారత్‌సహకరిస్తుందని పేర్కొన్నారు. గడచిన నాలుగేళ్లలో భారత్‌లో ఎలాంటి ఉగ్రసంఘటన జరగలేదని, నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని ఎన్‌డిఎప్రభుత్వ సమర్ధతకు ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగాపోరు కొనసాగించగలరా అని ఇమ్రాన్‌ను రాజ్‌నాధ్‌ప్రశ్నించారు. అమెరిక ఆసాయంతోనైనా తుదముట్టించాలని సూచించారు. ఈ పోరులో సాయం కోరితే భారత్‌ తప్పకుండా పాకిస్తాన్‌కు సహకరిస్తుందని అన్నారు. జైపూర్‌లో ఆదివారం మీడియాతోమాట్లాడుతూ జమ్ముకాశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని పేర్కొన్నారు. రాజకీయాల్లో కాంగ్రెస్‌పార్టీ సంక్షోభం, సమస్యలు సృష్టిస్తోందని అన్నారు. వారి మాటలకు చేతలకు ఎక్కడా పొంతన లేదని అన్నారు. ఉగ్రవాదం నిలిచిపోయిందని చెప్పలేనని, గడచిన నాలుగేళ్లలో ఎలాంటి భారీ సంఘటన జరగలేదని అన్నారు. ఉగ్రవాదం ఇపుడు కేవలం కాశ్మీర్‌కు మాత్రమే పరిమితం అయిందని, ఇపుడిపుడే అక్కడ పరిస్థితి మెరుగుపడుతోందన్నారు. జమ్ముకాశ్మీర్‌లో పంచాయితీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించగలిగామని చెప్పారు. దేశం చుట్టూ ఉన్న సరిహద్దులు భద్రంగా ఉన్నాయని, ఉగ్రవాదం సాధ్యమైనంతగా తగ్గించామని, నక్సలిజాన్ని రానున్న కాలంలోదేశం నుంచి పూర్తిగా నిర్మూలిస్తామని రాజ్‌నాధ్‌ వెల్లడించారు. నక్సల్‌ సంబంధిత సంఘటనలు దేశంలో 50 నుంచి 60శాతం తగ్గాయని అలాగే దేశవ్యాప్తంగా 90 జిల్లాలనుంచి ఇపుడు కేవలం ఎనిమిది తొమ్మిది జిల్లాల్లో మాత్రమే నక్సలిజం ఉందని ఆయన అన్నారు. వచ్చే మూడునుంచి ఐదేళ్లకు ఈ సమస్యను పూర్తిగా నిర్మూలిస్తామని అన్నారు.