ఇమ్రాన్ ప్ర‌మాణ‌స్వీకారానికి భార‌త ప్ర‌ముఖులు

Kapil dev & Imran khan
Kapil dev & Imran khan

ఇస్లామాబాద్: పాకిస్తాన్ నూతన ప్రధానిగా పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ ప్రమాన స్వీకారం ఈ నెల 11న జరగనున్న విషయం విదితం. 2014లో నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాల అధినేతలందరినీ పిలిచినట్టుగానే, ఇమ్రాన్ కూడా ప‌లు దేశాల ప్రముఖులను తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించనున్నారని పీటీఐకి చెందిన ఓ నేత మీడియాకు తెలిపారు. కాగా నరేంద్రమోదీని తర్వలోనే ఇమ్రాన్ కలిసి ఆహ్వానం అందజేస్తారనే విషయం తెలిసిందే. కాగా భారత మాజీ ప్రపంచ క్రికెటర్ కపిల్ దేవ్‌ను సైతం తన ప్రమాణ స్వీకారానికి ఇమ్రాన్ ఆహ్వానించనున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఇంతకు ముందు క్రికటరనే విషయం తెలిసిందే. కలిప్ దేవ్, ఇమ్రాన్ ఖాన్ కలిసి కూడా క్రికెట్ ఆడారు. అప్పటి నుంచి వారికి మంచి అనుబంధం ఉంది. అదే అనుబంధంతో తన ప్రమాణ స్వీకారానికి కపిల్‌ను ఆహ్వానిస్తున్నారట ఇమ్రాన్. వీరితో పాటు సునీల్ గవస్కర్, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌ను కూడా ఆహ్వానించనున్నారట. కాగా 2012 ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా కామెంటరీగా ఉన్న సునీల్ గవస్కర్.. ఇమ్రాన్ ఖాన్ భవిష్యత్తులో పాకిస్తాన్ ప్రధాన మంత్రి అవుతారని జోస్యం చెప్పారట. అది నిజం కావడం విశేషం. జూలై 25న జరిగిన పాకిస్తాన్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ‘పాకిస్తాన్ ఎ తెహ్రిక్ ఇన్సాఫ్’ అత్యధిక స్థానాలు గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొన్ని చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడాగట్టే పనిలో ఇమ్రాన్ బిజీగా ఉన్నారు.