అల్జీరియా నూతన అధ్యక్షుడిగా టెబోన్‌

Tebboune
Tebboune

అల్జీర్స్‌: అల్జీరియాకి కొత్త అధ్యక్షుడిగా ఆదేశ మాజీ ప్రధాని అబ్దుల్‌ మజీద్‌ టెబోన్‌ ఎన్నికయ్యారు. మాజీ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ బౌటెఫ్లికాను గద్దెదించిన తరువాత కొనసాగిన రాజకీయ అనిశ్చితికి తెరపడుతుందని అందరూ భావిస్తున్న సమయంలో నిరసనకారులు మాత్రం తమ ఉద్యమం ఆగబోదని స్పష్టం చేస్తున్నారు. బౌటెఫ్లికా మంత్రివర్గంలో గృహ నిర్మాణ మంత్రిగా పనిచేసిన టెబోన్‌ తరువాత కొంతకాలం ప్రధానిగా వ్యవహరించారు. అల్జీరియా ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారి శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అధ్యక్ష ఎన్నికల్లో టెబోన్‌ తన ప్రత్యర్థి అబ్దుల్‌ కాదర్‌ బెంగ్రినాపై 17.38 శాతం ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారని ప్రకటించారు. మరో మాజీ ప్రధాని ఆలీ బెన్‌ఫ్లిస్‌ 10.55 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచినట్లు ఎన్నికల ప్రధానాధికారి వెల్లడించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/