అమెరికా మార్కెట్‌లోకి రెడ్డీస్ ఔషధం

Dr.Reddy's Lab
Dr.Reddy’s Lab

అమెరికా మార్కెట్లోకి యాసిడ్‌ రిఫ్లక్స్‌ (ఛాతీలో మంట) వ్యాధి చికిత్సలో వినియోగించే ఔషధం ఎసోమెప్రాజోల్‌ మెగ్నీషియం క్యాప్సుల్స్‌ను విడుదల చేసినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది. ఓవర్‌ ది కౌంటర్‌ (ఒటిసి) ఔషధమైన దీన్ని 20 ఎంజి సామర్థ్యాల్లో తీసుకురానున్నట్లు తెలిపింది. జెనరిక్‌ వెర్షన్‌ నెగ్జామ్‌ 24 గంటల క్యాప్యూల్స్‌కు ఈ ఔషధం సమానమైనది పేర్కొంది. ఈ ఏడాది మే నెలతో ముగిసిన పన్నెండు నెలల కాలానికి గాను అమెరికాలో ఈ ఔషధ విక్రయాలు 31.1 కోట్ల డాలర్లుగా ఉన్నాయి.