అమెరికా ఆంక్ష‌ల‌కు ధీటుగా మేమూ స్పందిస్తాం

SERGEY RYBAKOV
SERGEY RYBAKOV

అమెరికా ఇటీవల రష్యన్‌ కంపెనీల, వ్యక్తుల బ్లాక్‌లిస్ట్‌ను విస్తరించిన నేపథ్యంలో అందుకు ప్రతిగా తాము కూడా చర్యలు తీసుకుంటామని రష్యా ప్రభుత్వం తెలిపింది. అమెరికా ఆంక్షల జాబితాలు పెరుగుతున్నాయని, ప్రస్తుతం 450 రష్యా ఆర్థిక సంస్థలపై ఆంక్షలు విధించిందని డిప్యూటీ విదేశాంగ మంత్రి సెర్గి రిబకొవ్‌ జెనీవాలో పేర్కొన్నారు. వాస్తవానికి, అన్ని ప్రధాన ఆర్థిక, ఇంధన, రక్షణ కంపెనీలపై ఆంక్షలు విధించారని, చిన్నా, పెద్ద సంస్థలపై పలువురు ప్రభుత్వం అధికారులపై ఈ ఆంక్షలు అమలవుతున్నాయని తెలిపారు. ఈ విషయంలో తాము కూడా అంతే దీటుగా స్పందిస్తామని చెప్పారు. తక్షణమే ఈ క్రమాన్ని ఆపాలని రిబకొవ్‌ కోరారు. రష్యాపై తాజాగా ఆంక్షలను సవరించిన రెండు రోజుల అనంతరం రష్యా అధికార స్పందన వెలువడింది.