అభిశంసన తీర్మానానికి మునుపే రాజీనామా

Pedro Pablo Kuczynski
Pedro Pablo Kuczynski

లిమా: ఎన్నికలలో ఓట్లు కోనుగోలు చేయడం ద్వారా గెలిచి అధికారం చేపట్టినట్లు ఆరోపణలు ఎదుర్కోంటున్న పెరూ అధ్యక్షుడు పెడ్రో పాబ్లో కుక్జిన్‌స్కీ(79) తనపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్‌ ఆమోదించటానికి ముందే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యాంగబద్ధంగా, సక్రమంగా అధికార బదిలీని ముగిస్తానని హామీ ఇచ్చిన కుక్జిన్‌స్కీ ఇప్పుదు దేశంలో కొనసాగుతున్న రాజకీయ వాతావరణం పాలనను అసాధ్య చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, తనపై ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షం కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తుండటంతో తాను పదవీకాలం ముగియటానికి ముందే వైదొలగాల్సి వస్తోందని ఆయన అన్నారు. పదవి నుండి వైదొలుగుతున్న కుక్జిన్‌స్కీ స్థానంలో ఉపాధ్యక్షుడు మార్టిన్‌ విజ్కారా పగ్గాలు చేపట్టనున్నట్లు తెలస్తుంది.