నేడు అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవం

ఏజెన్సీలో గిరిజనేతరుల ఓటు హక్కు రద్దు చేయాలి!

International Aboriginal Day
International Aboriginal Day

నేడు ఆదివాసీలు కోరేది ఏమిటి అంటే ఏజెన్సీలో గిరిజనేత రుల ఓటుహక్కు రద్దుచేయాలి. ఏజెన్సీలో గిరిజనేతరుల వలసలు అరికట్టాలి.

ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొల గించాలి. చెల్లప్ప కమిషన్‌ రద్దుచేయాలి. ఐటిడిఎలో జరుగు తున్న అవినీతిని అరికట్టాలి. ఐటిడిఎలో అటెండరు నుండి ఐఎయస్‌ వరకు ఆదివాసీలనే నియ మించాలి. ఏజెన్సీలో 1/70 చట్టాన్ని, పీసా చట్టాన్ని, జివోనెం.3ని పకడ్బందీగా అమలు చేయాలి.

ఏజెన్సీలో పోలీసును ఐటిడిఎ నియంత్ర ణలోకి తీసుకురావాలి. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలి. ఏజెన్సీలో ఆదివాసీలు సాగు చేస్తున్న పోడుభూములకు పట్టాలు ఇవ్వాలి. ఏజెన్సీలో గిరిజనేతరుల పట్టాలు రద్దు చేయాలని ఆదివాసీలు కోరుతున్నారు.

ఆ దివాసులు అడవితల్లి ముద్దుబిడ్డలు. ఈ సమాజానికి మూలవారసులు. భారతదేశానికి అసలు వారసులు. నీతినిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. ప్రాచీన చరిత్రకు, సంస్కృతికి, సాంప్రదాయాలకు, నిరాడంబరతకు నిలువ్ఞటద్దం ఈ ఆదివాసీలు. నేడు ఈ ఆది వాసేతర (అ)నాగరిక సమాజంలో ఇమడలేక 70 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో తమ మనుగడ కోసం అస్థిత్వం కోసం అల్లాడిపోతూ ఈ సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాలో అంతం అవ్ఞతున్నారు.

క్రీ.శ 1240 నుండి 1750 వరకు ఉన్న మధ్య కాలంలో స్వేచ్ఛగా, స్వతంత్రంగా విలసిల్లిన గోండ్వాన రాజ్యాలను ఏలిన ఆదివాసులు నేడు ఈ దోపిడీ నాగరిక సమాజం పరిణామక్రమంలో తమ మనుగడ, అస్థిత్వం, జీవన విధానం విధ్వంసమై పాలకుల చేత అణచివేయబడి, గిరిజనేతర నాగరిక సమాజం చేత దోపిడీకి గురవ్ఞతూ అంతరించిపో తున్నారు.

తరతరాలుగా వలసవాద దోపిడీకి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ఆదివాసీలు నేడు ఈ ఆధునిక (అ)నాగరిక ప్రజాస్వామిక యుగంలో తమ జీవించే హక్కు కోసం పోరాడి అలసిసొలసి ఆవిరైపోతున్నారు.

నేడు ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, జిల్లాల్లో ఎక్కడైనా సరే ఆదివాసీలు అస్థిత్వం అంచులో కొట్టుమిట్టాడుతున్నారు.

తరతరాలుగా అడవిలో కొండలలో జంతువ్ఞలతో మమేకమై వాటితో అవినాభావ సంబంధం కలిగి సహజీవనం గడిపే ఆదివాసీలు దుర్భరమైన జీవితాలు గడుపుతున్న నేపథ్యంలో ఆదివాసులు సాంప్రదాయ పోరాటాలను గుర్తించిన ఐక్యరాజ్యసమితి ఆదివాసుల వారసత్వపు హక్కులు,

అటవి వనరుల హక్కులకు సంబంధించిన తదితర సమస్యలపై1982 ఆగస్టు 9న జెనివాలో 26 మంది స్వతంత్ర మానవ హక్కుల మేధావ్ఞలతో వర్కింగ్‌ గ్రూప్‌ల సమావేశాన్ని నిర్వహించింది.

ఇందులో 140 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కమిటీ 1992 నుండి పది సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఆదివాసీల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి విశ్లేషించి 1994 నుండి 2014 వరకు ఆ మధ్య కాలాన్ని ఆదివాసీల అభివృద్ధి కాలంగా పరిగణించి ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవంగా ప్రకటించింది.

ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం ప్రపంచంలో 100 దేశాలలో ఐదువేల ఆదివాసీ తెగలకు చెందిన 50 కోట్ల ఆదివాసీలు 6700 భాషాలను మాట్లాడుతున్నారు.

మనదేశంలో 461 ఆదివాసీ తెగలు ఉండగా దానిలో 92 శాతం ఆదివాసీలు నేటికీ అడవిపైనే ఆధారపడి జీవిస్తు న్నారు. ఐక్యరాజ్యసమితి ఆదివాసీల కోసం అంత ర్జాతీయ ఆదివాసీ దినోత్సవం నాడు తీర్మానించిన విధానాలు, లక్ష్యాలు, అభివృద్ధి ఆశయాలు నేడు కాలరాయబడుతున్నాయి.

నేటి పాలకులు ఆదివాసీ లపై అనుసరిస్తున్న అత్యంత అమానుష, విధ్వంస కాండ, అణచివేత నేడు మన కళ్లముందు కనిపిస్తున్నది. ఐక్యరాజ్యసమితి తీర్మానించిన విధానాలు, లక్ష్యాలు, ఆశయాలు ప్రధానంగా అందులో ఆరు ముఖ్యాంశాలున్నాయి.

అవి ఆదివాసీల స్వయంపాలన హక్కు, ఆదివాసీల స్వేచ్ఛ హక్కు, ఆదివాసీల మానవ హక్కులు సంరక్షించే హక్కు, ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు జీవన విధానం, భాషావేషాధా రణనూ రక్షించే హక్కు.

ఆదివాసీల కోసం స్వయంపాలన వ్యవస్థలు ఏర్పాటు చేసే హక్కు, ఆదివాసీల విద్య,వైద్యం మౌలిక సదుపాయాల కల్పన చర్యలకు జీవం పోసే హక్కుగా తీర్మానించింది. కాని వాస్తంగా జరుగుతున్నదేమిటి? ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి ముసుగులో ధ్వంసం కాబడుతున్నది ఎవరు? అంటే ఆదివాసీ అడవి బిడ్డలే! అమెరికాలో రెడ్‌ ఇండియన్స్‌ అనేది ఆదివాసీలను అంతం చేసి వారి వనరులను దోచుకొని అమెరికా అగ్రరాజ్యంగా అవతరించింది. అదే సామ్రాజ్యవాదం

నేడు దేశంలో దండకారణ్యంలో, రాష్ట్రంలో, జిల్లాలో అడుగుబెట్టి ఆదివాసి ప్రాంతాలలో ఉన్న సహజ వనరులను, ఖనిజసంపదను రాజ్యాంగ వ్యతిరేకంగా దొడ్డిదారిలో దోచుకొని ఆదివాసీలను నిలువ్ఞనా నిర్వాసితులు చేస్తున్నారు.

దండకారణ్యంలో ఆదివాసీలపై నరమేధం కొనసాగుతుంది. ఆదివాసి మహిళలపై అంతులేని అత్యాచారాలు కొనసాగుతున్నాయి. ఆదివాసీల స్థితిగతులు పట్టించుకొనేవారు లేక నానాటికి దిగజారిపోతున్నారు.

ఆదివాసీల రాజ్యాంగ రక్షణలు రాలిపోతున్నాయి. ఐదోవ షెడ్యూల్‌, 6వ షెడ్యూల్‌ ఆదివాసీ భూభాగంలో ఉన్న ప్రాంతాలలోనూ రాజ్యాంగ వ్యతిరేకంగా పాలకులు పెత్తనం చేస్తున్నారు.

నేడు ఆదివాసీ ప్రాంతాలు ఆదివాసేతర (గిరిజనేతర) రాజకీయ యంత్రాంగంలో బందీగా మిగిలిపోతున్నాయి. ఏజెన్సీలో ఆదివాసి ప్రజాప్రతి నిధులు గిరిజనేతర రాజకీయ పార్టీలలో కీలుబొమ్మలుగా, తోలుబొమ్మలుగా మారిపోయారు.

ఏజెన్సీలో ఆదివాసీలను దోపిడీ చేస్తూ ఆదివాసీలపై పెత్తనం చెలాయిస్తున్న గిరిజనేతరులు నేడు ఆదివాసీల రిజర్వేషన్స్‌ కబ్జా చేయాలని కుట్రలు పన్నుతు న్నారు.

ఏజెన్సీలో చట్టవిరు ద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా పీసా చట్టానికి వ్యతిరేకంగా ఆదివాసీల సమాధులపైన ప్రాజెక్టులు ఓసిలు తీస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో జిల్లాల పునర్విభజనే పేరుతో ఆదివాసీ ప్రాంతాలను మైదాన ప్రాంతాలలో కలిపారు, కలుపు తున్నారు.

తెలంగాణాలో 90 శాతం ఆదివాసుల రిజర్వేషన్స్‌ ఉద్యోగాలు, లంబాడీలు అక్రమంగా, చట్టవ్యతిరేకంగా దోచుకుం టున్నారు. మరోవైపు చెల్లప్పకమిషన్‌ ద్వారా మరోమూడు కులాలను ఎస్టీ జాబితాలో కలిపి ఆదివాసులను నిర్వీర్యం చేస్తున్నారు.

భారతదేశంలో ఏజెన్సీ ఏరియాలో ఉన్న గిరిజనేతరులు ఆదివాసుల రిజర్వేషన్స్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ ఆదివాసులపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. దీనికి రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి.

ఏజెన్సీలో ఇంత ఆదివాసీ జీవన విధానం ధ్వంసం అవ్ఞతున్నా ప్రజాస్వామికవాదులు, ప్రజాసంఘాలు, మేధావ్ఞలు, రాజకీయపార్టీలు సైతం నోరు మెదపటం లేదు. ఆదివాసీలపై దోపిడీలో మేముసగభాగం అంటూ విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు.

నేడు ఆదివాసీలు తమ అస్తిత్వం కోసం చేస్తున్న పోరాటంలో ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు ఆదివాసీల వైపు ఉంటారో గిరిజనేతరుల వైపు ఉంటారో తెల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రెడ్‌ ఇండియన్స్‌ అనే ఆదివాసులను అంతం చేసి అమెరికా అగ్రరాజ్యంగా అవతరించినట్లుగానే తెలుగు ఉభయ రాష్ట్రాల మంత్రులు బంగారు తెలంగాణ, స్వర్ణాంధ్రప్రదేశ్‌ చేయాలని కలలు కంటున్నారు.

ప్రజాస్వామ్యం యుగంలో ఆదివాసీల హక్కులు కాలరాస్తున్నారు. నేడు ఆదివాసీలు కోరేది ఏమిటి అంటే ఏజెన్సీలో గిరిజనేతరుల ఓటుహక్కు రద్దు చేయాలి. ఏజెన్సీలో గిరిజనేతరుల వలసలు అరికట్టాలి. ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలి.

చెల్లప్ప కమిషన్‌ రద్దు చేయాలి. ఐటిడిఎలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలి. ఐటిడిఎలో అటెండరు నుండి ఐఎయస్‌ వరకు ఆదివాసీలనే నియ మించాలి. ఏజెన్సీలో 1/70 చట్టాన్ని, పీసా చట్టాన్ని, జివోనెం.3ని పకడ్బందీగా అమలు చేయాలి. ఏజెన్సీలో పోలీసును ఐటిడిఎ నియంత్రణలోకి తీసుకురావాలి. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలి.

ఏజెన్సీలో ఆదివాసీలు సాగు చేస్తున్న పోడుభూములకు పట్టాలు ఇవ్వాలి. ఏజెన్సీలో గిరిజనేతరుల పట్టాలు రద్దు చేయాలని ఆదివాసీలు కోరుతున్నారు. ఆదివాసీల ఆత్మగౌరవ పోరాటాలను మరింత పదునెక్కించి ఆదివాసీల హక్కుల కోసం జల్‌ జంగిల్‌ జమీన్‌ కోసం కొమరంబీం, బీర్సాముండా,సోయంగంగులు, సమ్మక్క సారక్క పోరాట స్ఫూర్తితో ఉద్యమాలకు సిద్ధంకావాల్సిన అవసరం ఉంది.

  • -కోరం జ్ఞానేశ్వరీ

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/