నిర్వహణ భారంతోనే ఎటిఎంల మూసివేత!

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మరింత అధ్వాన్నం

ATM's
ATM’s

ముంబయి: దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకుల ఎటిఎంలు రానురాను తగ్గిపోతున్నాయి. గడచిన రెండేల్లలో ఎటిఎంలు దేశవ్యాప్తంగా క్రమేపీ తగ్గుతూ చివరకు మూసివేయాలన్న ప్రతిపాదనలు కూడా అదుతున్నాయి సెక్యూరిటీ ఖర్చులుపెరుగుతున్నాయి. ఎటిఎం ఆపరేటర్లకు ఇచ్చే ఫీజులు కూడా తగ్గుతుండటంతో బ్యాంకర్లు ముఖ్యంగా వీటినిర్వహణ భారం ఎక్కువవుతున్నదని క్రమబద్దీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు నిన్నమొన్నటివరకూ శాఖాపరంగా క్రమబద్దీకరించి బ్యాంకుశాఖలను కొన్నింటిని విలీనంచేసి హేతుబద్దంచేసిన బ్యాంకర్లు ఇపుడు ఎటిఎంలపై దృష్టిపెట్టారు. నగదు అప్పటికప్పుడు డ్రాచేసుకోవాలంటే ఎటిఎంలకు పరుగులుతీయడం సహజంగా వస్తోంది. ఇపుడు ఎటిఎంలలో ఎక్కడ చూసినా నగదు కొరత తాండవిస్తోంది. పది ఎటిఎంలు తిరిగితే ఒక ఎటిఎంలో సొమ్ములు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులుమరింతగా అధ్వాన్నంగా ఉన్నాయి. ఎస్‌బిఐ ఎటిఎంలు అయితే నానాటికీ తీసికట్టుగా మారాయి. బ్రిక్స్‌దేశాలతోపోలిస్తే ఎటిఎంలు భారత్‌లో అతితక్కువగా ఉన్నాయి. ప్రతి లక్షమందికి ఎటిఎం అన్న చందంగా మారిపోయింది. ఎటికం ఆపరేటర్లు కూడా సాప్ట్‌వేర్‌ సామగ్రి, పరికరాలు వంటి వాటిని అప్‌డేట్‌చేసుకునేందుకు ఖర్చులుపెరుగుతున్నాయి. కేంద్ర బ్యాంకు గత ఏడాదినుంచి రక్షణ వనరులుపెంచాలని ఆదేశించింది. ఆర్ధికచేకూర్పుపై ప్రధానిమోడీ ఇస్తున్న నినాదాలను పరిగణనలోనికి తీసుకుంటే దేశవ్యాప్తంగా పెద్దనోట్ల చెలామణి నిలిపివేసిన తర్వాతనే నగదు సంక్షోభం పెరిగిందని చెప్పాలి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/