100 కోట్ల డాలర్ల నిధులు సమీకరిస్తాం

ఎస్‌బ్యాంకు సిఇఒ రవ్‌నీత్‌గిల్‌

ravneet gill
ravneet gill, yes bank CEO

న్యూఢిల్లీ: ఎస్‌బ్యాంకు కొత్తగా సిఇఒ ఎండిగా నియమితులయిన రవ్‌నీత్‌గిల్‌ వందకోట్ల డాలర్ల రూపంలో వాటా విక్రయాలనుంచి సమీకరించాలని నిర్ణయించారు. పెట్టుబడుల సమీకరనలో భ్యాంకు గతంలో ఎన్నడూలేని వఙదంగా భారీస్థాయిలో ముందుకువచ్చింది. ఇక పెట్టుబడులకిందికిరాని మొత్తం ఆరువేలనుంచి 20వేల కోట్లకు చేరుతున్నట్లు తెలింది. యుబిఎస్‌ బ్యాంకు ఇటీవల వందకోట్ల డాలర్లసమీకరణ బ్యాంకుకు అంత మద్దతివ్వదని ప్రకటించడాన్ని ఏ పద్దతిలోయుబిఎస్‌ చెపుతున్నదని ప్రశ్నించారు. ప్రస్తుతం మావద్ద పదిశాతం వరకూ వాటా విక్రయించుకోవచుచ. లేదా వందకోట్ల మూలధన నిధులను సమీకరించుకోవచ్చు. మాంతట మేం మా స్టాక్స్‌పై పదిశాతం ఆంక్షలుపరిమితులు విధించుకోలేదని చెప్పారు.

యుబిఎస్‌ బ్యాంకు రేటింగ్‌ తగ్గించడంవల్ల వచ్చే ఏడాదిలో రూ.90కి పడిపోతున్నదన్న ప్రశ్నలపై ఆయన మాట్లాడుతూ నిధుల సమీకరణకు మేం చేపట్టే మార్గాలతో రేటింగ్‌ దానంత అదే పెరుగుతుందని వెల్లడించారు. రియాల్టీ, ఫైనాన్స్‌ వంటి రంగాలకు ఎక్కువ రుణపరపతిని జారీచేయడంవల్ల కొంతమేర నగదు సమస్య ఎదురవుతున్నదా అన్న సమస్యకు ఆయన స్పందించారు. హౌసింగ్‌ ఫైనాన్స్‌కంపెనీలు, నాన్‌బ్యాంకింగ్‌ఫైనాన్స్‌ కంపెనీలు,రియల్‌ఎస్టేట్‌రంగాలపై ఒత్తిడిపెరిగిందని ఇపుడు బ్యాంకు ఏవిధంగా చర్యలు చేపడుతుందన్న ప్రశ్నపై ఎన్‌బిఎఫ్‌సిలకు ఉన్న నగదు కొరత సమస్య మాకు ఎలాంటి ప్రతిబంధకంకాదని, ఇకమిగిలిన రంగాలు కొంత ఒత్తిడి ఎదుర్కొంటున్నా మేం అప్రమత్తంగా వ్యవహరిస్తూ రుణపరపతిని అందిస్తున్నట్లు రణవీత్‌గిల్‌ వెల్లడించారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/