షావోమి 1.5బిలియన్‌ డాలర్లతో బైబాక్‌!

xiaomi
xiaomi


న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావొమి 1.5 బిలియన్‌ డాలర్ల షేర్ల బైబాక్‌ను ప్రతిపాదించింది. 12 బిలియన్‌ హాంకాంగ్‌ డాలర్లుగా ఈ బైబాక్‌ విలువ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. నగదునిర్వహణ ప్రక్రియలో భాగంగా ఈ షేర్‌బైబాక్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. షావొమి షేర్లు ఇటీవలికాలంలో ఏడుశాతానికిపైగా పెరిగాయి. కంపెనీ అప్పటికే ప్రకటించిన ఈక్విటీ ఆఫర్‌ను రద్దుచేసింది. కొత్తగా షేర్‌బైబాక్‌ను ప్రతిపాదించింది. ఇన్వెస్టర్లు గ్లోబల్‌ కంపెనీల్లో వాటాలు కొనుగోలుకు ఎక్కువ ఆసక్తిచూపిస్తుండటమే ఇందుకుకారణం. షావోమొ హాంకాంగ్‌ ఎక్ఛేంజిలో గత ఏడాది జాబితా అయింది. ఐపిఒ ధరలపరంగాచూస్తే సగానికిపైగా మార్కెట్‌ పోటీ కారణంగా తగ్గాయి. ఐపిఒలోప్రకటించిన ధరలకంటే 50శాతం అడుగంటాయి. అయితే హాంకాంగ్‌ స్టాక్‌ మార్కెట్లలోని నష్టాలను అధిగమించి రికవరీవైపు కంపెనీ దృష్టిపెట్టింది. హాంకాంగ్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల వల్ల కొంత కంపెనీ వాటాలమార్కెట్‌ధరలు పడిపోయాయి. సిటీ ఎక్ఛేంజిలో 152 బిలియన్‌ డాలర్ల సంపద ఆవిరి అయింది. షావొమికంపెనీకి నగదు, లేదా త్సంబంధిత ఆస్తులు 34.9బిలియన్‌ యువాన/్ల అంటే 4.92 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు వెల్లడించింది. జూన్‌30వ తేదీనాటికి మొత్తం రుణాలు 13.8 బిలియన్‌యువాన్లుగా ఉన్నాయి. కంపెనీ సానుకూలంగా నగదు లభ్యతను 11 బిలియన్‌ యువాన్లను సాధించింది. ఈపరిస్థితుల్లో కంపెనీ తలపెట్టిన షేర్‌బైబాక్‌ కొంతవరకూ కంపెనీపట్ల ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపుతుందని చెపుతున్నారు. బీజింగ్‌కేంద్రంగా నడుస్తున్న ఈకంపెనీ గ్లోబల్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ను వణికించిందనే చెప్పాలి. అయితేచైనాలో మాత్రం షావొమి వాటా తగ్గింది. ఏప్రిల్‌జూన్‌త్రైమాసికంలో ఐదోవంతుపడిపోయాయి. మొబైల్‌ దగ్గజం హువేయి 31శాతంపెరిగిందని కెనాలిస్‌ సర్వేసంస్థ అంచనావేసింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/

https://www.vaartha.com/news/national/