నవంబరు నెలలో పెరిగిన డబ్యూపిఐ

WPI inflation rises
WPI inflation rises

ఢిల్లీ: ఆహార పదార్థాల ధరలు పెరగడంతో డబ్యూపిఐ(టోకు ధరల సూచి) ఆధారిత ద్రవ్యోల్బణం పెరిగింది. గతేడాది నవంబరులో 4.47 శాతంగా నమోదైన డబ్యూపిఐ. ఈ ఏడాది అక్టోబరులో డబ్యూపిఐ 0.16 శాతంగా ఉండగా, నవంబరులో 0.58 శాతం పెరుగుదల నమోదు చేసుకుంది. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆహార పదార్థాల ధరలు అక్టోబరులో 9.08 శాతం ఉండగా నవంబరులో 11 శాతానికి చేరాయి. కూరగాయలు, పప్పు, మాంసం వంటి ఆహార వస్తువుల ధరలు పెరగడంతో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.54 శాతం పెరిగి మూడేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. మరోవైపు విద్యుత్‌, మైనింగ్‌, తయారీ రంగాల వృద్ధి మందగించడంతో పారిశ్రామిక ఉత్పత్తి తగ్గిపోయింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/