సెట్‌ టాప్‌ బాక్స్‌తోపనిలేకుండా ఆపరేటర్‌ను మార్చవచ్చు!

settop box
settop box

ముంబై, : టివి ప్రేక్షకులకు ట్రా§్‌ు చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఈ ఏడాది చివరి నుంచి సెట్‌ ఆప్‌ బాక్స్‌ మార్చుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. సెట్‌టాప్‌ బాక్స్‌ (ఎస్‌టిబి) మార్చుకోకుండానే డిటిహెచ్‌, కేబుల్‌ ఆపరేటర్లను మార్చే వెసులుబాటు త్వరలో తీసుకురానున్నట్లు తెలిపారు. గత రెండేళ్లుగా ఎస్‌టివి పోర్టబులిటీ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. దీరిరి అమలె అడ్డంకిగా ఉన్న పెద్దపెద్ద సమస్యలు తీరిపోయాయని చెప్పారు. కొన్ని వ్యాపార సవాళ్లు మాత్రమే మిగిలిఉన్నాయన్నారు. వీటిపై దృష్టిసారించామని, ఈ ఏడాది చివరి నాటికి ఈ సమస్యకు కూడా ముగింపు పలుకుతామన్నారు. ఈ వ్యాపార సవాళ్లు కూడా పరిష్కారమైతే ఈ ఏడాది చివరి నాటికి పోర్టబులిటీ అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ ఆలోచన రాగానే అమలుకాదని, దానిపై దృష్టిసారించామన్నారు. డిటిహెచ్‌, కేబుల్‌ సర్వీసులకు సంబంధించి ట్రా§్‌ు కొత్త టారిఫ్‌ నిబంధనలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. కొత్త టారిఫ్‌ నిబంధనలకు సంబంధించి కొద్ది వారాలుగా కేబుల్‌ టివి చందాదారుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టిడిహెచ్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు బేస్‌ ప్యాక్‌లోనే అపరిమిత ఫ్రీ టు ఎయిర్‌ ఛానళ్లను అందిస్తున్నాయి.

మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/