విప్రో బైబ్యాక్‌లో షేర్లు తిరిగి ఇచ్చేస్తే బెస్ట్‌

wipro
wipro

న్యూఢిల్లీ: విప్రో త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ అంచనాల కంటే ఉత్సాహకరంగా ఉన్నాయి. ప్రొఫిటబులిటీ సహా డిజిటల్‌ రెవెన్యూల విషయంలో పనితీరును మెరుగుపర్చుకుంది. క్యాష్‌ప్లో నిర్వాహణ కూడా మెరుగ్గానే ఉన్నట్లు రూ.10,500కోట్ల బైబ్యాక్‌ ప్రకటనతో అర్థమవుతోంది. షేర్‌ హోల్డర్లతో నమ్మకాన్ని మరింతగా పొదుగొల్పేందుకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇవేవీ విప్రోపై పటిష్టమైన నమ్మకాన్ని కలిగించడంలేదు. ఎందుకంటే రెవెన్యూ వృద్ధిపరంగా అంత గొప్ప ప్రదర్శనను విప్రో కనబరచడం లేదు. 2008-19 నాటి స్థాయిలకు వృద్ధి పడిపోతోంది. రెవెన్యూ కేవలం 3.8శాతం మాత్రమే పెరిగింది. అంతకుముందు ఏడాది కంటే 4.3శాతంగా ఉంది. గత ఏడేళ్లుగా వృద్ధి సింగిల్‌ డిజిట్‌కు మాత్రమే పరిమితమైంది. 2012లో మాత్రమే సంస్థ 13.4శాతం వృద్ధిని నమోదు చేసింది. మళ్లీ ఇప్పటివరకూ అలాంటి దాఖలాలే లేవు. ఆ సమయంలో టిసిఎస్‌, హెచ్‌సిఎల్‌ టెక్‌ సంస్థలు భారీ లాభాలను సాధించాయి. డాలర్‌ టర్మ్స్‌లో గత ఐదేళ్లకాంపౌండ్‌ గ్రోత్‌ను విశ్లేషిస్తే టిసిఎస్‌ 9.2శాతం, ఇన్ఫోసిస్‌ 7.4శాతం భారీగా పెరగ్గా, విప్రో మాత్రం 4.2శాతం మాత్రమే పెరుగుదలను నమోదు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో విప్రో భవిష్యత్‌ అంచనాలు కూడా అంత గొప్పగా కనిపించ డంలేదు. అందుకే రూ.325కి కంపెనీ ఇచ్చిన బైబ్యాక్‌ ఆఫర్‌ను షేర్లను టెండర్‌ చేయడమే బెస్ట్‌ అనేది మార్కెట్‌ నిపుణులు సలహా. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ధరతో పోలిస్తే 15.7శాతం ఎక్కువ ధరను విప్రో నిర్ణయించింది. ఒకవేళ షేర్లు టెండర్‌ చేసి మనకు వస్తే, మంచి లాభాలతో బయటపడ్డట్టే.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/