ప్రభుత్వ ఖజానాకు రూ.లక్ష కోట్ల రాక!

RBI
RBI

న్యూఢిల్లీ: నరేంద్రమోడీ ప్రభుత్వం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ డివిడెండ్‌ను ఆర్‌బిఐ త్వరలో ప్రభుత్వానికి బదలీ చేయనుందనే అంచనాలు వెల్లడవుతున్నాయి. ఆర్‌బిఐ మిగులు నిల్వల నిర్వహణపై కీలక కమిటీ సిఫారసులు బహిర్గతం కాకముందే కేంద్రానికి ఆర్‌బిఐ నుంచిరూ.లక్ష కోట్లు రానున్నాయని డచ్‌ బ్యాంకు అంతర్గత నివేదిక వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఆర్‌బిఐ భారత ప్రభుత్వానికి భారీ డివిడెండ్‌ ఇవ్వనుంది డచ్‌ బ్యాంకు ఇండియా చీఫ్‌ ఎకనమిస్ట్‌ కౌశిక్‌ దాస్‌ ఈ నివేదికలో పేర్కొన్నారు.

ఆర్‌బిఐ నుంచి సమకూరే రూ.లక్ష కోట్లను ప్రభుత్వం సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించడంతో పాటు బడ్జెట్‌లో వివిధ పద్దుల కింత పొందుపరచే వ్యయాలకు వెచ్చిస్తారని నివేదిక పేర్కొంది. ఆర్‌బిఐ నిధుల ఊతంతో రానున్న బడ్జెట్‌లో వ్యవసాయం, గ్రామీణ మౌలిక ప్రాజెక్టులు, విద్య, వైద్యం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలపై నిధుల కేటాయింపు పెంచుతారని కౌశిక్‌ దాస్‌ పేర్కొన్నారు. ఆర్‌బిఐ మిగులు నిల్వలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో పన్నేతర రాబడిని పెంచే అవకాశం ఉందని డచ్‌ బ్యాంకు నివేదిక అంచనా వేసింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/