స్పైస్‌జెట్‌లోకి త్వరలోనే 16 బోయింగ్‌ విమానాలు

spicejet flight
spicejet flight

న్యూఢిల్లీ: అప్పుల ఉబిలో కురుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌, మరోవైపు ఇథియోపియా విమాన ప్రమాదంతో బోయింగ్‌ 737 మాక్స్‌ విమానాల నిలిపివేత. దీంతో దేశంలో విమానాలు అందుబాటులోకి లేకపోవడంతో ఎయిర్‌లైన్లు చివరి నిమిషంలో సర్వీసులను రద్దు చేయాల్సి వస్తుంది. ఈపరిస్థితుల కారణంగా ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ త్వరలోనే 16 బోయింగ్‌ విమానాలను అందుబాటులోకి తీసుకురానుంది. 16 బోయింగ్‌ 737800 ఎన్‌జీ విమానాలను డ్రై లీజు కింద సంస్థలోకి తీసుకుంటున్నట్లు స్పైస్‌జెట్‌ వెల్లడించింది. ఈ విమానాలను దిగుమతి చేసుకునేందుకు అవసరమైన నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌(ఎన్‌ఓసీ) కోసం డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు సంస్థ తెలిపింది. మరో పది రోజుల్లో ఈ విమానాలు సంస్థలోకి చేరుతాయని పేర్కొంది. కాగా.. ఈ వార్తల నేపథ్యంలో సంస్థ షేర్లు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో స్పైస్‌జెట్‌ షేరు విలువ దాదాపు 10శాతం లాభంతో ట్రేడ్‌ అవుతోంది.


మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/