త్వరలోనే వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌

whatsapp
whatsapp

హైదరాబాద్‌: వాట్సాప్‌ రాకతోనేటి యువత నేరుగా ఫోన్‌లో మాట్లాడేకంటే సందేశాలపైనే మొగ్గు చూపుతున్నారు. అయితే సాధారణంగా వాట్సాప్‌లో వీడియో, రాతరూప సందేశాలు పంపేముందు ఒకసారి పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల తప్పుడు సందేశాలు పంపే అవకాశం ఉండదు. కానీ సంక్షిప్త అడియో సందేశాలను పంపే ముందు వాటిని మరోసారి సరిచూసుకునేందుకు అవకాశం ఉండదు. నేరుగా అవతలి వ్యక్తికి చేరుకుంటాయి. ఆ రికార్డింగ్‌లో పొరపాట్లు జరిగితే ఇంకా అంతే సంగతులు. ఆ ఇబ్బందిని తొలగించేందుకు ఇపుడు వాట్సాప్ సంస్థ సన్నద్ధమౌతోంది. ఆడియో రికార్డింగ్‌ సందేశం పంపేముందు పరిశీలించుకునే విధంగా యాప్‌లో మార్పులు చేస్తోంది. ఈ ఫీచర్‌ ఐవోఎస్‌లో బీటా దశలో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.


తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/tours/