రంగురాళ్లు కొంటున్నది సంపన్న యువకులే!

colour stones
colour stones

ముంబై: ట్రెండ్స్‌ ఎప్పటికప్పుడూ మారిపోతూ ఉంటాయి. కానీ కొత్త ట్రెండ్స్‌ అనేవి పాత వారికి మరింతగా సోబగులు అద్దటం వల్లనే ఆదరణ పొందుతున్నాయి. ఫ్యాషన్‌ ఎక్కడ మొదలైనా, అది ప్రపంచాన్ని మొత్తం చుట్టేసి గానీ పోదు. ఇదంతా ఎందుకంటే, ఒకప్పుడు రాజుల కాలంలో వారి ఆభరణాలలో వజ్ర, వైడుర్యాలు, ముత్యాలు, రత్నాలు ఎక్కువగా వాడేవారు. శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో అయితే ఏకంగా రత్నాలు రాసులుగా పోసి మరీ విక్రయించేవారట. అంటే, అప్పట్లో వారికి అంత డిమాండ్‌ ఉండేది. కాలక్రమంలో ఆభరణాలలో బంగారంతోపాటు అధికంగా వజ్రాలు వాడడం మొదలైంది. అక్కడక్కడా ఇతరత్రా వాడినా పెద్ద మొత్తంలో లేదు. కానీ గత పదేళ్ల కాలంలో భారత దేశంలో రంగు రాళ్ల వినియోగం బాగా పెరిగిపోయింది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/