జొమాటో కీలక ప్రకటన


10,000 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం

Zomato
Zomato

న్యూఢిల్లీ: ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో కీలక ప్రకటన చేసింది. త్వరలోనే తాము లాభాలబాట పట్టనున్నామని తెలిపింది. ఇందుకు అనుగుణంగా టెక్నాలజీ, ప్రొడక్ట్‌‌, డేటా సైన్సెస్‌‌ టీమ్స్‌‌ కోసం భారీగా ఉద్యోగులను చేర్చుకోనున్నట్లు వెల్లడించింది. ఈ నెలలోనే దాదాపు 10,000 మందిని విధుల్లోకి తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పింది. కస్టమర్ సర్వీస్ అవసరం తగ్గడం వల్లే గురుగ్రామ్ లోని ఆఫీసులో 540 మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని జొమాటో సీఈవో దీపిందర్‌‌ గోయల్‌ వివరణ ఇచ్చారు. ఇలా ఉద్యోగాలు కోల్పోయినవారికి రెండు నెలల జీతం, వచ్చే ఏడాది జనవరి వరకూ పలు ప్రయోజనాలను అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. వీరి కోసం జాబ్ ఫెయిర్ కూడా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ తాము 1,200 మందిని విధుల్లోకి తీసుకున్నామని గోయల్ తెలిపారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/