కర్నూలులో వాల్‍‌మార్ట్ హోల్‌సేల్ స్టోర్ ప్రారంభం

walmart center
walmart center

కర్నూలు: అమెరికాకు చెందిన రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ నవ్యాంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో స్టోర్‌ను ప్రారంభించింది. దీంతో దేశవ్యాప్తంగా బెస్ట్ ప్రైస్ మోడర్న్ హోల్ సేల్ స్టోర్స్ పేరుతో ఏర్పాటు చేసిన ఔట్ లెట్ల సంఖ్య 28కి చేరుకుంది. కంపెనీ సభ్యులు, పార్ట్‌నర్స్, అసోసియేట్స్, వాటాదారుల నుంచి విశేష స్పందన నేపథ్యంలో వ్యాపారాన్ని భారీగా విస్తరిస్తున్నట్లు వాల్ మార్ట్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో క్రిష్ అయ్యర్ తెలిపారు. ఇందులో భాగంగా కర్నూలులో ఔట్ లెట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన అయిదో స్టోర్. ఇది వరకు గుంటూరు, రాజమహేంద్రవరం, విజయవాడ, విశాఖపట్నంలో స్టోర్స్ ఏర్పాటు చేసింది. వాల్ మార్ట్ శాఖ ఏర్పాటు సంతోషకరమని, దీని ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ అన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/