ప్రభుత్వం ఆదుకొకపోతే వోడాఫోన్‌ ఐడియా మూతపడుతుంది

Kumar Mangalam Birla
Kumar Mangalam Birla

న్యూఢిల్లీ: ప్రభుత్వం నుంచి తమకు తక్షణ సహాయం లభించకుంటే వొడాఫోన్‌ ఐడియా కథ ముగిసినట్టేనని సంస్థ చైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా ఆందోళన వ్యక్తం చేశారు. స్పెక్ట్రమ్‌ చెల్లింపులు, లైసెన్స్‌ ఫీజలు బకాయిలు విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహిరంచని పక్షంలో దేశంలో మూడో అతిపెద్ద మొబైల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ వొడాఫోన్‌ ఇండియా మూతపడుతుందని ఆయన అన్నారు. ముఖేష్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ జియో కారుచౌక టారిఫ్‌ను ఎదుర్కొనేందుకు గత ఏడాది ఐడియా సెల్యులార్‌, టెలికాం దిగ్గజం వొడాఫోన్‌ ఇండియాలు ఒకే కంపెనీగా విలీనమైన సంగతి తెలిసిందే. దీంతో వొడాఫోన్‌ ఐడియా సంస్థ ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలతో సహా రుణభారం రూ.1.17లక్షల కోట్లకు చేరింది. భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, ఇతర టెలికాం కంపెనీలు కలిసి లైసెన్స్‌ ఫీజు, స్సెక్ట్రమ్‌ యూసేజ్‌ చార్జీలు కలుపుకుని గత 14 ఏళ్లకు గాను ప్రభుత్వానికి రూ. 1.47లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలపై వడ్డీ, జరిమానాను మాఫీ చేయాలని భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా కోరుతున్నాయి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/