కస్టమర్లకు వొడాఫోన్‌ ఐడియా బంపర్‌ ఆఫర్‌

మూడు రీచార్జ్‌ ప్లాన్లపై డబుల్‌ డేటా ఆఫర్‌!!`

vodafone-idea-introduces-new-double-data-offer
vodafone-idea-introduces-new-double-data-offer

ముంబయి: వొడాఫోన్‌ ఐడియా తన కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. మూడు ప్రీపెయిడ్‌ ప్లాన్‌లో కొత్త డబుల్‌ డేటా ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. రూ. 249, రూ. 399, రూ. 599 రీఛార్జిపై అదనంగా 1.5 జీబీ డేటాను అందించనుంది. రూ. 249 ప్లాన్‌లో 84జీబీ, రూ.399 ప్లాన్‌లో 168 జీబీ, రూ.599 ప్లాన్‌లో 252 జీబీ పుల్‌ స్పీడ్‌ డేటాను వినియోగదారులకు అందించనుంది. ఈ కొత్త ఆఫర్‌ మొత్తం 23 టెలికాం సర్కిల్స్‌లో అందుబాటులో ఉంటుందని వొడాఫోన్‌ ఐడియా ప్రకటించింది. కొత్త సవరణ ప్రకారం రోజు అందిస్తున్న 1.5 జీబీ డేటాకు బదులుగా రెట్టింపు అంటే..రోజుకు 3జీబీ హై స్పీడ్‌ 4జి డేటాను పొందవచ్చు. దీంతో పాటు ఈ మూడు ప్లాన్‌లకు అన్‌లిమిటెడ్‌ లోకల్‌, నేషనల్‌ వాయిస్‌ కాల్స్‌తో పాటు 100 ఎస్‌ఎంస్‌లను ఉచితం, వొడాఫోన్‌ కస్టమర్లకు కాంప్లిమెంటరీ కింద జీ5, ఐడియా సబ్‌స్కెబర్‌లకు ఐడియా మూవీస్‌, టీవీని అందిస్తుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/