ఈడి ముందు చందాకొచ్చర్‌ గైర్హాజరు

Chanda Kochhar
Chanda Kochhar


న్యూఢిల్లీ: వీడియోకాన్‌ గ్రూప్‌నకు రుణమంజూరు విషయంలో ఈడి ముందు హాజరుకావాలని ఐసిఐసిఐ బ్యాంక్‌ మాజీ సిఈఓ, ఎండి చందాకొచ్చర్‌ సోమవారం విచరణకు హాజరుకాలేదు. ఆరోగ్య కారణాల వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు సమాచారం ఇచ్చినట్లు ఈడికి చెందిన ఓ అధికారి తెలిపారు. దీంతో మరోసారి ఆమెకు ఈడి సమన్లు జారీ చేయనుంది. గతవారం కూడా ఇదే కారణంతో హాజరుకాకపోవడం విశేషం. కాగా ఈ కేసులో మరికొంతమంది బ్యాంకు అధికారులను కూడా ఈడి త్వరలో విచారించనుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/