‘ఎవర్‌ గ్రీన్‌టీ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’ కన్నుమూత

B.M. Khaitan
B.M. Khaitan

ముంబయి: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎం.బి. ఖైతాన్‌ (92) ఈరోజు కన్నుమూశారు. ఆయన వృద్ధాప్యంలో వచ్చే సమస్యలతో బాధపడుతు ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఖైతాన్‌కు భారత్‌లోని టీ పరిశ్రమకు పెద్దదిక్కుగా భావిస్తారు. ఆయన్ను ఎవర్‌ గ్రీన్‌టీ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా అని పారిశ్రామిక వర్గాల్లో అభివర్ణిస్తారు. విలిమ్‌సన్‌ మగోర్‌ గ్రూప్‌ వ్యవస్థాపకులు అయిన ఖైతాన్‌.. గత ఏడాది తన గ్రూప్‌నకు చెందిన ఎవ్రీడే ఇండస్ట్రీస్‌, మెక్‌లాయిద్‌ రస్సెల్‌ సంస్థల్లో ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు.
ఆయన మృతికి భారత టీ అసోసియేషన్‌ కూడా సంతాపం తెలిపింది. ఖఖటీ అసోసియేషన్‌ సభ్యులు ఆయన మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతితో ఒక శకం ముగిసింది. ఒక మార్గదర్శి, నాయకుడిని టీ పరిశ్రమ కోల్పోయింది. అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/