వ్యాన్‌గార్డ్‌ పెట్టుబడులురూ.1,294కోట్లు

ముంబై, : గతవారం రోజులుగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ర్యాలీతీస్తున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు, దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో మార్కెట్లకు మద్దతుగా నిలిచారు. సెన్సెక్స్‌, నిఫ్టీ గత 2018 సెప్టెంబరు నాటి గరిష్టానికి చేరుకున్నాయి. సెన్సెక్స్‌ 38వేల పాయింట్లు, నిఫ్టీ 11,400పాయింట్లతో దూసుకెళ్తున్నాయి. నేషనల్‌ స్టాక్‌ ఎక్ఛేంజీ వెల్లడించిన సమాచారం మేరకు వ్యాన్‌గార్డ్‌ 10 సంస్థల షేర్లపై రూ.1,294కోట్లను ఇన్వెస్ట్‌ చేసింది.కాగా వ్యాన్‌ గార్డ్‌ కంపెనీ తన వద్దనున్న రూ.2.22కోట్ల విలువైన యూనీటెక్‌ షేర్లను మాత్రం విక్రయించడం ఇక్కడ గమనార్హం. ఈ 10 షేర్లలో ఆర్‌బిఎల్‌ బ్యాంకు మీద రూ.652కోట్లను అత్యధికంగా ఖర్చుచేసింది. బాటాఇండియా స్టాక్స్‌ మీద రూ.117.05కోట్లు, ఎన్‌ఐఐటి టెక్నాలజీస్‌ మీద రూ.112.28కోట్లు పెట్టుబడులుగా పెట్టింది. ఇక ఆర్తీ ఇండస్ట్రీస్‌ మీద రూ.59.35కోట్లు, క్యాస్ట్రాల్‌ ఇండియా స్టాక్స్‌ మీద రూ.84.40కోట్లు, వీ మార్ట్‌ రిటైల్‌ మీద 40.96కోట్లను పెట్టుబడులుగా పెట్టింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈ 10 స్టాక్స్‌ మంచి ప్రభావం చూపవచ్చని ఇప్పటికే పలు బ్రోకింగ్‌ కంపెనీలు, స్టాక్‌ ఎనలిస్టులు పేర్కొన్నారు. రానున్న 12 కాలంలో ఈ స్టాక్స్‌ 20నుంచి 60 శాతం లాభాలను తీసుకురావొచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. ఓవరాల్‌గా ఫిబ్రవరి 22 నుంచి ఈ మార్చి 15వ తేదీ నాటికి విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన మొత్తం రూ.4,323కోట్లుగా ఉంది.

https://www.vaartha.com/news/business/మరిన్ని తాజా బిజినెస్‌ తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.