రూ.80కి చేరనున్న డాలర్‌ మారకం విలువలు!

rupee
rupee


రాయల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కెనడా అంచనాలు
న్యూఢిల్లీ: భారత్‌ కరెన్సీ రూపాయి డాలరుకు 80 రూపాయలకు చేరుతుందన్న అంచనాలున్నాయి. రాయల్‌బ్యాంక్‌ ఆఫ్‌ కెనడా చేస్తున్న విశ్లేషణల ప్రకారం డాలరుతో రూపాయి మారకం విలువలు వచ్చే సెప్టెంబరునాటికి 80రూపాయలకు చేరగదలని అంచనా. ఆసియా కరెన్సీల్లో జపాన్‌ను మినహాయించి మొత్తం కరెన్సీలు అనిశ్చితంగానే నడిచాయి. ప్రధానమంత్ర ఇనరేంద్రమోడీ ఈసారి ఎన్నికల్లో గట్టిపోటీ ఎదుర్కొంటారన్న అంచనాలు అంతర్జాతీయంగా కొంతమేర కరెన్సీ క్షీణతకు దారితీసిందనే చెప్పాలి. 71.25 రూపాయలనుంచి మరింతగా క్షీణిస్తుందని ఆర్‌బిసి హాంకాంగ్‌ ఆసియా ఫోరెక్స్‌ హెడ్‌ స్యూ ట్రించ్‌ వెల్లడించారు. రిజర్వుబ్యాంకు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మాత్రం వడ్డీరేట్లను గతనెలలో తగ్గించారు. ఆర్ధికవవ్యవస్థకు కొంతమేర ఊతం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గురువారం నాటి గణాంకాలనుచూస్తేమూడునెలల పాటు వృద్ధి కనిపించింది. డిసెంబరునెలో చూస్తే గడచిన ఐదుత్రైమాసికాల్లోని కనిష్టస్థాయిని నమోదుచేసింది. వినియోగరంగ ద్రవ్యోల్బణంపరిధిలోచూస్తే గవర్నర్‌ దాస్‌ రానున్న కాలంలోమరిన్ని కోతలు అవసరం అవుతాయన్నట్లుగా ఉందని ట్రించ్‌ వెల్లడించారు. ఆర్ధికలోటు కట్టడికి నిధులసమీకరణ సవాళ్లతో కూడుకున్నదే అవుతుందని చెప్పారు. రూపాయి ఇప్పటికే అధ్వాన్నంగా పనిచేస్తోంది. ఆసియాలో జపాన్‌ కరెన్సీ మినహాయిస్తే అనిశ్చితంగా ఉందని అంచనా.