టివిఎస్‌ నుంచి అపాచీ బిఎస్‌6 బైకులు లాంచ్‌


TVS Apache RTR 200 4V and RTR 160 4V BS6 launched

ముంబయి: టివిఎస్‌ మోటార్స్‌ బిఎస్‌ 6 ప్రమాణాలు కలిగిన టివిఎస్‌ అపాచీ మోటార్‌ బైక్స్‌ను లాంచ్‌ చేసింది. అపాచీ ఆర్‌టిఆర్‌ 160 4వి, ఆర్‌టిఆర్‌ 200 4వి బైక్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. 2020 సంవత్సరానికి గాను వీటిని విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. కాగా 197.75సిసి సామర్థ్యంగల సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ అపాచీ ఆర్‌టిఆర్‌ 200 4వి ఎక్స్‌షోరూం ధర రూ.1.24లక్షలుగా, ఆర్‌టిఆర్‌ 160 4వి(డిస్క్‌) ధర రూ. 1.03 లక్షలుగా ఉంది. ఇకపోతే దీనిలోని మరో మోడల్‌ ఆర్‌టిఆర్‌160 4వి(డ్రమ్‌) ధర రూ. 99,950 గా ప్రకటించింది. టివిఎస్‌ అపాచీ ఆర్‌టిఆర్‌ 160 4వి బిఎస్‌6 159.7 సిసి సామర్థ్యం కలిగి ఉంది. దీనిలో 4 స్ట్రోక్‌, 4 వాల్వ్స్‌, ఆయిల్‌ కూల్‌డ్‌ ఇంజిన్‌, ఇంకా 5 స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ దీని ప్రత్యేకత. ఇక ఆర్‌టిఆర్‌ 200 బిఎస్‌6 197.75 సిసి కలిగి ఉండగా దీనిలోనూ అవే ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/