టిటికె ప్రెస్టేజ్‌ అప్‌, దివాన్‌ డౌన్‌

prestige
prestige

ముంబై, వాటాదారులకు ఉచితంగా షేర్లను జారీచేసేందుకు అనుకూలంగా బోనస్‌ ఇష్యూకి ప్రతిపాదించినట్లు టిటికె ప్రెస్టేజ్‌ తాజాగా వెల్లడించింది. ఈ ప్రతిపాదనపై చర్చించేందుకు కంపెనీ బోర్డు ఈ నెల 29న సమావేశం కానున్నట్లు తెలియచేఇసంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో ఈ షేరు 4.5శాతం పెరిగి రూ.8143వద్ద ట్రేడవుతోంది. మొదట ఒకదశలో రూ.8189వరకూ పుంజుకుంది. అదేవిధంగా దివాన్‌ హౌసింగ్‌ షేరు కూడా రేటింగ్‌ దిగ్గజం క్రిసిల్‌ కంపెనీ జారీచేసిన కమర్షియల్‌ పేపర్స్‌ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసినట్లు వెల్లడికావడంతో దివాన్‌ హౌసింగ్‌ షేరు అమ్మకాలతో నీరసించింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో ఈ షేరు 2.3శాతం తగిత్గ రూ.131దిగువకు చేరి రూ.850కోట్ల విలువైన కమర్షియల్‌ పేపర్స్‌ రేటింగ్‌ను క్రిసిల్‌ ఎ1నుంచి ఎ2ప్లస్‌కు పడిపోయినట్లు దివాన్‌ హౌసింగ్‌ తెలిపింది.


మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/