ఆర్‌బీఐ మిగులు నిధులు ప్రభుత్వానికి ఇవ్వాల్సిందే?

Reserve Bank of India
Reserve Bank of India

న్యూఢిల్లీ: ఎననామిక్‌ క్యాపిటల్‌ ఫ్రేమ్‌ వర్క్‌పై ఏర్పాటు చేసిన బిమల్‌ జలాన్‌ కమిటి ఈరోజు సమావేశమైంది. ఈ భేటిలో ఆర్‌బీఐ వద్ద మిగులు రిజర్వును ప్రభుత్వానికి ఇవ్వాలిందేనని కమిటి అభిప్రాయపడినట్లు సమాచారం. త్వరలో ఈ నివేదికను రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌కు సమర్పించనుంది. ఆర్‌బీఐ వద్ద మిగులు నిధులను విడతల వారీగా మూడు నుంచి ఐదేళ్లలో ప్రభుత్వానికి బదలాయించాలిగగ అని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. కాకపోతే ఈ నివేదికపై ప్యానల్‌లోనే భిన్నాభిప్రాయలు ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆర్‌బీఐ వద్ద ఉన్న ఆస్తుల్లో 27శాతం మిగులుగా భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకులు 14శాతం రిజర్వును నిర్వహిస్తున్నాయి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/