టికెట్‌ ఛార్జిలను పెంచుతున్న భారతీయ రైల్వే!

కిలోమీటరుకు ఐదునుంచి 40 పైసలవరకూ పెరుగుదల

indian railways
indian railway

న్యూఢిలీ : భారతీయ రైల్వేలు ప్యాసింజర్‌ టికెట్‌ధరలను పెంచేయోచనలో ఉన్నాయి. అన్ని తరగతులకు ఛార్జిలు ఈ వారంనుంచే పెంచేయోచనలో ఉన్నట్లు సమాచారం. కిలోమీటరుకు ఐదునుంచి 40 పైసలవరకూ పెరుగుతాయని పెద్ద ఎత్తున ప్రచారంలోనికి వచ్చింది. ప్రధాన మంత్రి కార్యాలయంనుంచి ఈ ప్రతిపాదనలకు నవంబరులోనే ఆమోదం లభించింది. అయిత ేజార్ఖండ్‌లోజరిగిన అసెంబ్లీ ఎన్నికల కారణంగా వీటిని వాయిదావేసినట్లు తేలింది. ఆర్థిక మందగమనంకారణంగా రైల్వేలకు ఆర్థికభారం పెరుగుతున్నది. రవాణా ఛార్జిలు కూడా స్వల్పంగా పెంచాలనినిర్ణయించాయి. రోడ్డురవాణానుంచి ఇపుడు కార్గోసర్వీసులు వేగవంతం కావడంతోరైల్వేకు పోటీపెరిగింది. ప్యాసింజర్‌ విభాగంలో ఎలాంటి ధరలను పెంచడం జరగలేదు. గడచిన కొన్నేళ్లుగా ప్యాసింజర్‌ టికెట్‌ఛార్జిల జోలికి వెళ్లకపోవడంతో ఈసారి వాటిపై దృష్టిపెట్టింది. ఫ్లెక్సీ ఫేర్‌ వ్యవస్థను కొన్ని రైళ్లలోప్రవేశపెట్టింది. అలాగే రీఫండ్‌వ్యవస్థలోచేసిన మార్పులవల్ల కొంత రాబడులుపెరిగాయి. 2019 సెప్టెంబరులో రైల్వేలు మొత్తం రాబడులు భారీగా తగ్గాయి. వరుసగా రెండోనెలలో కూడా 38నెలల గరిష్ట దిగువకు తగ్గిపోయాయి. 4.2శాతం క్షీణించి 13,169.20 కోట్లకు చేరాయి. అక్టోబరులో ఈ క్షీణత 7.8శాతానికిపెరిగింది. రైల్వేలు ఇప్పటికీ రాబడుల్లో పతనం ఎదుర్కొంటున్నాయి. 19,412 కోట్లు ఏప్రిల్‌ అక్టోబరు మధ్యకాలంలో లోటు ఉన్నట్లు తేలింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/