ట్రేడ్‌వార్‌తో ఉత్పత్తిబేస్‌గా మారుతున్న భారత్‌

తొమ్మిది భారత్‌ సంస్థలకు ఎగుమతుల్లో మెగా లబ్ది

l&T.
l&T.

న్యూఢిల్లీ: అమెరికా చైనాల మధ్య కొనసాగుతున్న ట్రేడ్‌వార్‌తో కొన్ని విదేశీ కంపెనీలు ఇపుడు చైనా కేంద్రంగా ఉత్పత్తిని బైటి దేశాలకు బదలాయించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. అమెరికా ఆంక్షలు, ట్యారిఫ్‌ల కారణంగా ఉత్పత్తి వ్యయం పెరగడంతోపాటు, కార్మికశక్తి కూడా అంతంతమాత్రంగానే ఉందని, దీనికితోడు ఉత్పత్తివ్యయం పెరుగుతున్నందున చైనానుంచి ఇతర దేశాలకు మళ్లడమేమేలన్న భావనతో ఉన్నారు. దీనివల్ల ప్రధానంగా ఇపుడు భారత్‌లోని తొమ్మిది సంస్థలకు మేలు కలుగుతుందని అంచనా. ఎల్‌అండ్‌టి, సీమెన్స్‌, హ్యావెల్స్‌,విర్ల్‌పూల్‌ వంటి సంస్థలకు భారీ లాభం కలుగుతుందని అంచనా. క్రెడిట్‌స్యూసీ అంతర్జాతీయ ఇన్వెస్టర్‌ సంస్థ వేసిన అంచనాలను చూస్తే వంద కంపెనీలను సర్వేచేసింది. 350 నుంచి 500 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు ఇతర దేశాలకు పోతున్నట్లు తెలుస్తోంది. ఇతర దేశాలు జీర్ణించుకునే శక్తి ఉంటే మరింతగా ఎగుమతులు వెళ్లిపోయే పరిస్థితి ఉందని అంచనా. వచ్చే ఐదేళ్లలో చైనా ఉత్పత్తిరంగంలో కార్మికశక్తి2015నుంచి చూస్తే 20 మిలియన్‌లకు తగ్గింది. అదనంగా 9-15 మిలియన్‌లమందికి మరింతగా తగ్గుతుందన్న అంచనాలున్నాయి. రెడీమేడ్‌ దుస్తులు, వస్త్రపరిశ్రమ ఎలక్ట్రానిక్స్‌ అసెంబ్లింగ్‌, పాదరక్షలు, ఆటబొమ్మలు, ఫర్నిచర్‌ వంటి రంగాలపైనే ఈప్రభావం ఎక్కువగా ఉంటుంది.

మొత్తం 13దేశాలను సర్వేచేస్తే లక్షకోట్ల డాలర్ల అమ్మకాలపై ప్రభావం పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు అమెరికా ట్యారిఫల్‌లను రివర్స్‌చేసినా ఈ బదలీలు మానవని అంచనా. ఎక్కువ ఉత్పత్తివ్యయం, కార్మికులు అందుబాటులోనికి రాకపోవడమే ఇందుకుకీలకమేఇ ఉత్పత్తిదారులు చెపుతున్నారు. ఇపపటికే మూడింట రెండొంతుల సంస్థలు చైనానుంచి ఉత్పత్తిని ఇతరదేశాలకు మళ్లిస్తున్నాయి. 91శాతం కంపెనీలు అమెరికాసుంకాలు తగ్గించినా మేం మాత్రం ఇతరదేశాలకు వెళ్లకతప్పదని తమ ఉత్పత్తిబేస్‌ను మార్చాల్సి ఉంటుందని చెపుతున్నారు. ఎక్కువగా వియత్నాం, భారత్‌, తైవాన్‌, మెక్సికో,యూరోపియన్‌ యూనియన్‌, థాయిలాండ్‌, ఇండోనేసియా దేశాలవైపు చూస్తున్నాయి. ఎక్కుశ సంస్థలు వియత్నాం, భారత్‌లకేప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆ తర్వాత ఇతర దేశాలవైపు చూస్తున్నాయి. బంగ్లాదేశ్‌ వస్త్రపరివ్రమపై మంచి పట్టు ఉన్నందున భారత ఖూడా దిగుమతులకు మంచి అవకాశం ఉంటుందని, ఎలక్ట్రానిక్స్‌పరంగా భారత్‌ మంచి మార్కెట్‌ అని భావిస్తున్నాయి. ఉత్పత్తిరంగం బదలాయింపువల్ల ఎబిబి, అంబర్‌ ఇంటర్స్‌, డిక్సాన్‌టెక్‌, హ్యావెల్స్‌, ఎల్‌అండ్‌టి, పవర్‌గ్రిడ్‌; సీమెన్స్‌, లీమ్‌లీజ్‌, విర్ల్‌పూల్‌ సంస్థలకు ఈ ఉత్పత్తి బేస్‌ బదిలీవల్ల ఎక్కువ ప్రభావం ఉంటుందని అంచనా.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి…https://www.vaartha.com/news/business/