టైటాన్‌ అప్‌, టిటికె డల్‌

న్యూఢిల్లీ : ఈ మధ్యకాలంలో కళకళలాడుతున్న టైటాన్‌ లిమిటెడ్‌ షేరు మరోసారి ఇనుఎ్వస్టర్లను ఆకట్టుకుంటోంది. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో ఈ షేరు 2.3శాతం పెరిగి రూ.1112వద్ద ట్రేడవుతోంది. మొదట రూ.1114వరకూ పుంజుకుంది. ఇది సరికొత్త గరిష్టం కాగా, కంపెనీ మార్కెట్‌ విలువ రూ.లక్షకోట్లకు చేరువైంది. ప్రస్తుతం రూ.98,207కోట్లకు చేరింది. తద్వారా ఇప్పటికే రూ.ట్రిలియన్‌ మార్కెట్‌ క్యాప్‌ కలిగి 27 కంపెనీల ఎలైట్‌ క్లబ్‌ జాబితాలో చేరేబాటలో సాగుతోంది. గత ఐదు నెలల్లో టైటాన్‌ షేరు 37శాతం పెరిగింది. జిఎస్‌టి ఫలితంగా అసంఘటిత రంగం నుంచి జ్యుయెల్లరీ కొనుగోళ్లు బ్రాండెడ్‌ వైపు మొగ్గుచూపుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 42 శాతం పెరిగి రూ.416కోట్లను తాకింది. టిటికె ప్రెస్టేజ్‌ లిమిటెడ్‌ షేరు ప్రస్తుత రేటు రీత్యా భవిష్యత్‌లో పెరిగేందుకు అవకాశాలు తక్కువేనంటూ విదేశీ రీసెర్చ్‌ సంస్థ సిఎల్‌ఎస్‌ఎ తాజాగా అభిప్రాయపడింది. ఫలితంగా కొనుగోలు రేటింగ్‌ను సెల్‌కు సవరిస్తున్నట్లు తెలియచేసింది. దీంతో ఈ షేరు 2.4శాతం తగ్గి రూ.8902వద్ద ట్రేడవుతోంది. మొదట రూ.8834వరకూ క్షీణించింది.

https://www.vaartha.com/news/business/
మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: