నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి: నాలుగో రోజూ సూచీలు నష్టాలను చవి చూశాయి. ఈరోజు నాటి ట్రేడింగ్లో స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 48.39 పాయింట్ల నష్టపోయి, 37,982.74వద్దకు చేరగా, నిఫ్టీ 15.15 పాయింట్ల నష్టంతో 11,331 పాయింట్లకు పడిపోయింది. నేటి ట్రేడింగ్లో పవర్ గ్రిడ్ కార్ప్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, హీరో మోటోకార్ప్, ఏషియన్ పెయింట్ తదితర షేర్లు లాభపడగా, ఎస్బీఐ, ఇండియాబుల్స్ హౌసింగ్, హెచ్డీఎఫ్సీ, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో తదితర షేర్లు నష్టాలను చవి చూశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లతోపాటు, ఆటో, లోహ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ, ఇన్ఫ్రా, ఐటీ రంగాల షేర్లు 3శాతం మేర నష్టపోయాయి.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/