డాలరుతో లాభపడిన రూపాయి!

rupee vs dollar
rupee vs dollar

ముంబయి: ఈక్విటీమార్కెట్లలో నెలకొన్న సానుకూల పరిస్థితులు కరెన్సీ మార్కెట్లపై చూపించాయి. డాలరుతో రూపాయి మారకం విలువలు తొమ్మిదిపైసలు పెరిగి 70.81గా ట్రేడింగ్‌ను పారంభించింది. అమెరికా ఫెడ్‌రిజర్వు తన బెంచ్‌మార్క్‌ వడ్డీరేట్లను 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించడం కూడా కొంతప్రభావం చూపించింది. ఈక్విటీ మార్కెట్లలో ఆరంభంనుంచి స్టాక్‌సూచీలు ఊపందుకోవడం, ఇతర మేజర్‌ కరెన్సీలతోపోలిస్తే డాలర్‌ కొంతనీరసించడం భారత్‌కరెన్సీ మార్కెట్‌కు అలాగే విదేశీ నిధుల రాక కూడా రూపాయికి కొంత బలం చేకూర్చిందని అంచనా. అంతర్‌బ్యాంక్‌ విదేశీ కరెన్సీ మార్కెట్లలో రూపాయి ట్రేడింగ్‌ 70.77వద్దప్రారంభం అయింది. 70.81 రూపాయలవరకూ పెరిగి తొమ్మిది పైసలు లాభపడింది. తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/