ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త అవకాశం

instagram
instagram
న్యూఢిల్లీ ప్రభాతవార్త : ఫేస్‌బుక్ యాజమాన్య సంస్థ ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్‌ను విడుదల చేయనుంది. ‘క్లోజ్ ఫ్రెండ్స్’ అనే ఈ సరికొత్త ఫీచర్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇకపై తమ స్టోరీలను షేర్ చేసుకునే అవకాశం కల్పించనుంది.ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు ఒక బిలియన్ (100 కోట్లు) వినియోగదారులు ఉన్నారు. ఇందులో కొంత మందితో గ్రూపులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. దీనినే ‘క్లోజ్ ఫ్రెండ్స్’ అనే పేరుతో తీసుకువచ్చింది. ఇప్పటి తమ ఫాలోవర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ స్టోరీలు, ఇకపై గ్రూపులో షేర్ చేయవచ్చు. దీని వల్ల ఫాలోవర్సు కానీ వారు కూడా స్టోరీలు చూసే అవకాశం ఉంది.గ్రూపులోని సభ్యులు షేర్ చేసిన స్టోరీ ఒక ట్రేలో కనిపిస్తుంది. దాని చుట్టూ ఆకుపచ్చ రంగులో ఒక వృత్తం ఉంటుంది. అదే విధంగా స్టోరీ వీక్షిస్తున్నప్పుడు ఆకుపచ్చ రంగు బాడ్జితో కనిపిస్తుంది.మిగతా సోషల్ మీడియాలతో పోల్చితే ఇన్‌స్టాగ్రామ్‌ ఆదాయం ఎక్కువగా ఉన్నందువల్ల ఫేస్‌బుక్ దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అత్యంత జాగ్రత్తలతో వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగించేలా మరిన్ని చర్యలు చేపట్టనుంది. అలాగే సోషల్ మీడియా ఎదుర్కొంటున్న ఫేర్ న్యూస్‌ల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు ఇన్‌స్టాగ్రామ్ పేర్కొంది.