స్మార్ట్‌ఫోన్‌ ప్రీమియం సెగ్మెంట్‌లో యాపిల్‌ మొదటి స్థానం

Apple
Apple

ఢీల్లీ: ప్రపంచ వ్యాప్తంగా యాపిల్‌ ఉత్పత్తులకు ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాపిల్‌ నుండి కొత్త ఉత్పత్తి మార్కెట్లోకి వస్తుందంటే క్యూలైన్లు కట్టిమరీ దక్కించుకునే ప్రయత్నం చేస్తారు యాపిల్‌ ప్రేమికులు. ఈ ఏడాది సెప్టెంబరు 30తో ముగిసిన మూడో త్రైమాసికంలో భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ ప్రీమియం సెగ్మెంట్‌(రూ.. 35,000 పైబడి)లో 51.3శాతం వాటాతో మొదటిస్థానంలో నిలవడం వరుసగా ఇది రెండోసారి ఇంటర్‌నేషనల్‌ డేటా కార్పొరేషన్‌ (ఐడిసి) ఒక ప్రకటలో తెలిపింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/