ప్రయాణికులకు గో ఎయిర్‌, పేటిఎం షాక్‌

Go Air
Go Air

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తెలుగు ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. టికెట్లు బుక్‌ చేసుకుని విమానం ఎక్కేందుకు సిధ్దమైన వీరికి గో ఎయిర్‌, పేటిఎం సంయుక్తంగా షాకిచ్చాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు వీరంతా పేటియం నుంచి టికెట్లు బుక్‌ చేసుకున్నారు. తీరా విమానం ఎక్కేందుకు సిద్ధమైన తరుణంలో వారిని గో ఎయిర్‌ నిరాకరించింది. దీంతో సుమారు 40 మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో పడిగాపులు కాస్తున్నారు. ఒకే పిఎన్‌ఆర్‌ నంబరుపై వేర్వేరు పేర్లున్నాయని గో ఎయిర్‌ చెప్పడంతో అందరూ నిర్ఘాంతపోయారు. చివరకు వాళ్లు విమానం ఎక్కకుండానే గురువారం ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్‌ పంపేశారు. ఈ విషయంపై ఇంతవరకు గో ఎయిర్‌ యాజమాన్యం కాని, అటు పేటియం గానీ స్పందించలేదు. దీంతో ఆ సంస్థల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/