హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్‌ యాప్ లలో సాంకేతిక సమస్య

ఈ అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపిన బ్యాంక్‌

HDFC BANK
HDFC BANK

ముంబయి: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ యాప్ ల్లో 24 గంటలుగా వినియోగదారులకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. నిన్న ఉదయం 10 గంటలకు సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. దీనిపై ఆ బ్యాంక్ వివరణ ఇచ్చింది. సాంకేతిక కారణాల వల్ల కొంతమంది ఖాతాదారులు హెచ్‌డీఎఫ్‌సీ నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ యాప్‌లో లాగిన్‌ కాలేకపోతున్నారని తెలిపింది. తాము సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని వివరించింది. త్వరలోనే తాము సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. ఖాతాదారులకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నట్లు బ్యాంక్‌ ట్విట్టర్‌లో పేర్కొంది. ఆ వెబ్ సైట్ ను ఓపెన్ చేస్తే… ‘భారీ సంఖ్యలో వినియోగదారులు ఒక్కసారిగా నెట్‌ బ్యాంకింగ్‌ సిస్టమ్‌లోకి లాగిన్‌ అవ్వడంతో ఒత్తిడి పెరిగింది. ఖాతాదారులు కాసేపు ఆగి ప్రయత్నించాలి’ అని ఓ సందేశం కనపడుతోంది. దీనిపై ఖాతాదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/