కార్ల పరిశ్రమలో టాటా మోటార్స్‌ కొత్త రికార్డు

TATA
TATA

కార్ల పరిశ్రమలో టాటా మోటార్స్‌ కొత్త రికార్డు

ముంబై: కార్ల ఉత్పత్తి పరిశ్రమలో ఒక విచిత్ర మైన పరిస్థితి సెప్టెంబరు నెలలో నమోదైంది. యావత్‌ పరిశ్రమలో అమ్మకాలు పెరుగుతున్న చమురు ధరల వల్ల తగ్గిపోగా, ఒక్క టాటామోటార్స్‌ కంపెనీ అమ్మకాలు పెరిగాయి. ఇటీవల కాలంలో చమురు ధరలు విపరీతంగా పెరగడం, అలాగే కార్ల ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల కంపెనీ అమ్మకాలు తగ్గాయి.

అయితే టాటామోటార్స్‌ విషయంతో మాత్రం పెరుగుదల కనిపిస్తోంది. గత సంవత్సరం ఇదే సమయంలో ఉన్న అమ్మకాల కంటే ఈ సంవత్సరం అమ్మకాలు 7శాతం పెరిగాయి. మారుతి సుజుకి, టయోటా, కిర్లోస్కర్‌ అమ్మకాలు గత ఏడాది కంటే తగ్గాయి. ఈ పెరిగిన విభాగాల్లో ప్యాసింజర్‌ కార్లు, బహు వాణిజ్య ప్రయోజన కార్లు కూడా ఉన్నాయి. టాటామోటార్స్‌తో పోలిస్తే, మారుతి తక్కువ అమ్మకాలను నమోదు చేసింది. మారుతి అమ్మకాలు గత సంవత్సరం కంటే 1.4శాతం తగ్గాయి. హుండా§్‌ు కంపెనీ అమ్మకాలు 4.5శాతం తగ్గాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ ప్యాసింజర్‌ వెహికిల్స్‌ అమ్మకాలు 16 శాతం తగ్గాయి.

టాటామోటార్స్‌ అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణం కొత్త తరహా వాహనాలను విడుదల చేయడం. క్లిష్ట సమయంలో కూడా ఈ కంపెనీ అమ్మకాల విషయంలో పెరుగుదలను సాధించింది. కంపెనీ అనుసరించిన వ్యూహం ఫలించింది. గత సంవత్సరం సెప్టెంబరు నెలల 17,286యూనిట్లు అమ్మకాల సాధించగా, ఈ సంవత్సరం 7 శాతం పెరిగి అది 18,429యూనిట్లకు చేరింది. గత మూడు నెలల నుంచి ఈ అమ్మకాలు పెరుగుతూనే వస్తున్నాయి. కానీ, పరిశ్రమలోని మిగతా కంపెనీల అమ్మ కాలు తగ్గు తూనే ఉన్నా యి.

ముఖ్యంగా టియాగో కారు ఈ పెరుగుదలకు కారణ మవుతోంది. టియాగో ఎన్‌ఆర్‌జి రోజుకు 300 యూనిట్లు నమోదు కావడం విశే షం. అదేవిధం గా ఈ కంపెనీ ఉత్పత్తి చేసిన ఎస్‌యువి నెక్జన్‌ కారు ఈ విజయా నికి ప్రధాన కార ణం. నెక్జన్‌ ఎఎంటి, నెక్జన్‌ క్రాజ్‌ కార్లుకూడా అమ్మకాలలో గణనీయమై ప్రగతిని సాధిం చాయి. కస్టమర్ల రిపోర్టు ను బట్టి తమ కార్ల లో అవసరమైన మేరకు మార్పులు చేసి ఎప్పటికప్పుడు కొత్త ఎడిషన్‌ను తయారు చేస్తున్నామని, దీనివల్లే అమ్మకాలు పెరుగుతున్నాయని టాటా మోటార్స్‌ ఉన్నత ఉద్యోగి ఒకరు వెల్లడించారు.