టాటా స్పాంజ్‌, ఉషా మార్టిన్‌ జోష్‌

Tata Sponge, Usha Martin
Tata Sponge, Usha Martin

ముంబై,: సొంత అవసరాలకు ఏర్పాటు చేసుకున్న విద్యుత్‌ యూనిట్‌తో పాటు ఉషా మార్జిన్‌కు చెందని స్టీల్‌ బిజినెస్‌ కొనుగోలు ప్రక్రియను పూర్తిచేసినట్లు తాజాగా టాటా స్పాంజ్‌ ఐరన్‌ తెలిపింది. హైగ్రేడ్‌ స్పాంజ్‌ ఐరన్‌ తయారుచేసే టాటా స్పాంజ్‌ కంపెనీలో ప్రమోటర్లకు ప్రస్తుతం 54.50శాతం వాటా ఉంది. దీంతో ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో 3 శాతం పెరిగి రూ.767వద్ద కదులుతోంది. మొదట రూ.784వరకూ పెరిగింది. అదేవిధంగా ఉషా మార్టిన్‌ కూడా టాటా స్పాంజ్‌కు స్టీల్‌ బిజినెస్‌ విక్రయాన్ని పూర్తిచేసినట్లు స్టీల్‌ వైర్‌రోప్‌ల ఉత్పత్తి సంస్థ ఉషా మార్జిన్‌ తాజాగా తెలిపింది. దీంతో ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో 3 శాతం పెరిగి రూ.38వద్ద ట్రేడవుతోంది. కంపెనీలో ప్రమోటర్లకు ప్రస్తుతం 50.66శాతం వాటా ఉంది.

మరిన్నీ తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/business/