టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌కు భారీ పారితోషికం

ముంబయి: 2019 ఆర్థిక సంవత్సరానికి టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ పారితోషికం అందుకోనున్నారు. 2018లో చంద్రశేఖరన్ రూ.55.11కోట్లు అందుకోగా..ఈ ఏడాది రూ.65.52కోట్లు పారితోషికంగా అందుకోనున్నారు. అంటే దాదాపు 19శాతం వృద్ధి చెందింది. ఇందులో రూ.54కోట్లు ఆయన కమిషన్‌గా అందుకుంటారు. అదే 2018లో రూ.47కోట్ల కమిషన్ పుచ్చుకున్నారు. అంతేకాక ఆయనతో పాటు కంపెనీలోని పలువురి ప్రముఖుల వేతనాల్లో భారీ పెరుగుదల కనిపించింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సౌరభ్ అగర్వాల్ వేతనం సైతం 22శాతం పెరిగింది. 2019 ఆర్థిక సంవత్సరానికి ఆయన రూ.16.45కోట్లు అందుకున్నారు. అందులో రూ.12కోట్లు కమిషన్. స్వతంత్ర డైరెక్టర్లలో వేణు శ్రీనివాసన్ కమిషన్ తీసుకోవడానికి నిరాకరించగా.. అజయ్ పిరమాల్ రూ.1.9కోట్ల కమిషన్ స్వీకరించారు. రోనేంద్ర సేన్ రూ.2కోట్లు, హరీష్ మన్వాణీ రూ.1.85కోట్లు, ఫరీదా 1.9కోట్లు కమిషన్‌గా అందుకోనున్నారు. ఈ పారితోషికాలను ఆగస్టులో ముంబయిలో జరగనున్న టాటా సన్స్ 101వ వార్షిక సమావేశంలో అందజేయనున్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/